ఈరోజు భారీగా పతనమైన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.!

Updated on 07-Sep-2022
HIGHLIGHTS

ఈరోజు బంగారం ధర భారీగా పతనమయ్యింది

ఈరోజు ఒక్కసారిగా బంగారం రేటు భారీగా పడిపోయింది

గోల్డ్ రేట్ 7 నెలల కనిష్ఠానికి బంగారం ధర చేరుకుంది

ఈరోజు బంగారం ధర భారీగా పతనమయ్యింది. సెప్టెంబర్ 2 న ఏడు నెలల కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర, గడిచిన 5 రోజుల్లో మెల్లగా పెరుగుతూ వచ్చింది. అయితే, ఈరోజు ఒక్కసారిగా బంగారం రేటు మళ్ళి అదే రేటును చేరుకుంది. ఈరోజు మర్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ 540 రూపాయలు నష్టాన్ని చవిచూడడంతో, 7 నెలల కనిష్ఠానికి బంగారం ధర చేరుకుంది. ఈరోజు పలు ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,900 రూపాయలుగా ఉండగా, ఈరోజు 500 రూపాయలు దిగువకు చేరుకొని 46,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,620 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,410 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,610 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,650 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :