ఈ హువావే మీడియాప్యాడ్ M5 లైట్ అనే కొత్త టాబ్లెట్ను నిరాడంబరంగా ప్రారంభించింది. ఈ కొత్త టాబ్లెట్ ఒక అల్యూమినియం యునిబాడి నిర్మాణం మరియు ఒక క్వాడ్స్పీ(4) స్పీకర్ల సెటప్ కలిగివుంది. ఈ టాబ్లెట్ 1920 x 1200 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్తో ఒక 10.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీని ప్రదర్శన యొక్క కారక నిష్పత్తి 16:10 గా పొందింది. ఒక మధ్యస్థాయి కిరిన్ 659 SoC ఈ పరికరానికి శక్తినిస్తుంది.
హువావే మీడియాప్యాడ్ M5 లైట్ రెండు రకాల్లో అందుబాటులో ఉంది. ఒకటి 3GB RAM మరియు 32GB నిల్వ మరియు మరొకటి 4GB RAM మరియు 64GB నిల్వ తో ఉంటాయి. ఈ టాబ్లెట్ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది సంస్థ యొక్క M- పెన్ లైట్ స్టైలస్ కి మద్దతు ఇస్తుంది, అని హువావే పేర్కొంది. అయితే, టాబ్లెట్ తో స్టైలెస్ లభ్యత దాని ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మీడియాప్యాడ్ M5 లైట్ పాడ్ Android Oreo v8.0 ఆధారిత, EMUI 8.0 పై నడుస్తుంది.
ఈ కొత్త టాబ్లెట్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణంగా క్వాడ్-స్పీకర్ సెటప్గా చెప్పవచ్చు. ఇది హర్మన్ కార్డన్ చేత ట్యూన్ చేయబడిన స్పీకర్లను మరియు హువావే యొక్క హిస్టెన్ 5.0 సౌండ్ సిస్టంను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ పరికరం షాంపైన్ గోల్డ్ మరియు స్పేస్ గ్రే కలర్ వైవిధ్యాలలో అందుబాటులో ఉంది. ఏదేమైనప్పటికీ, భారతదేశంలో ఈ పరికరం ఎప్పుడు విడుదల చేయనున్నారన్న విషయం లేదా ఇంకా తెలియరాలేదు.