Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ మరియు అప్డేట్స్ ను లైవ్ లో చూడండి.!

Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ మరియు అప్డేట్స్ ను లైవ్ లో చూడండి.!
HIGHLIGHTS

జూలై 14 వ తేదీ భూమి నుండి నింగికెగసిన చంద్రయాన్ - 3

చంద్రయాన్ - 3 అంచెలంచలుగా చంద్రుని ఉపరితలాన్ని చేరుకుంది

Chandrayaan-3 ప్రతీ ఒక్కరూ LIVE లో చూసి ఆనందించే అవకాశం

జూలై 14 వ తేదీ భూమి నుండి నింగికెగసిన చంద్రయాన్ – 3 ఉపగ్రహం అంచెలంచలుగా చంద్రుని ఉపరితలాన్ని చేరుకుంది. ఇప్పటికే విజయంగా చంద్రుని కక్షలోకి చేరుకున్న చంద్రయాన్ – 3, ఇప్పుడు ల్యాండింగ్ కోసం రెడీ గా వుంది. ఇండియా కంటే ముందుగా లూనార్ ఉపరితలం పైన కాలు మోపాలని చూసిన రష్యా విఫలమయ్యింది. అందుకే, ఇప్పుడు అందరి కళ్ళు Chandrayaan-3 వైపే ఉన్నాయి. ఇండియా కూడా ఈ అద్భుతాన్ని ప్రపంచ నలుమూలల ఉన్న ప్రతీ ఒక్కరూ LIVE లో చూసి ఆనందించే అవకాశాన్ని అందించింది. 

ప్రపంచానికి భారతీయ సత్తాను చాటేందుకు ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISSRO) ఈ నిర్ణయం తీసుకుంది. Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ ని ప్రపంచానికి చూపడానికి ల్యాండింగ్ ఈవెంట్ ని ISSRO LIVE లో అందిస్తోంది.  ఈ కార్యక్రమం ఆగష్టు 23వ తేది, అంటే బుధవారం 18:04 Hrs. IST (సాయంత్రం 6:04pm) లైవ్ ప్రసారం చేస్తుంది. ఈ ల్యాండింగ్ ని ప్రతీ ఒక్కరూ చూసి అంనందించే గొప్ప అవకాశాన్ని ISSRO అందించింది. 

ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు కూడా మీ ఫోన్ లోనే LIVE గా చూడాలనుకుంటే ఈ క్రింద అందించిన లింక్స్ ద్వారా నేరుగా Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ ను చూడవచ్చు. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISSRO) ఈ లింక్స్ ను అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేసింది.       

Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ ని ISRO Website నుండి చూడటానికి క్రింద Live LINK  పైన క్లిక్ చేయండి 

Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ ని YouTube నుండి చూడటానికి క్రింద Live LINK పైన క్లిక్ చేయండి

Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ ని Facebook నుండి చూడటానికి క్రింద Live LINK పైన క్లిక్ చేయండి.

Image source: ISSRO twitter Post

 

Digit.in
Logo
Digit.in
Logo