Asia Cup 2023: IND vs PAK మ్యాచ్ ను OTT సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా చూడాలా.!

Asia Cup 2023: IND vs PAK మ్యాచ్ ను OTT సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా చూడాలా.!
HIGHLIGHTS

Asia Cup 2023: IND vs PAK మ్యాచ్ ను OTT సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా చూడవచ్చు

Disney Plus Hotstar మ్యాచ్ లను ఉచితంగా ప్రసారం చేయడానికి సిద్ధమయ్యింది

IND vs PAK మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభం అవుతుంది

Asia Cup 2023: IND vs PAK మ్యాచ్ ను OTT సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ Disney Plus Hotstar పైన Asia Cup 2023 LIVE మ్యాచ్ లను ఉచితంగానే యూజర్ల కోసం అందించబోతున్నట్లు ప్రకటించింది. కొత్త సబ్ స్క్రైబర్స్ ను ఆకర్షించే పనిలో పడిన OTT ప్లాట్ ఫామ్ భారతీయులకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ లను ఉచితంగా ప్రసారం చేయడానికి సిద్ధమయ్యింది. అంటే, ఈ సదవకాశాన్ని వినియోగించుకొని Asia Cup 2023 మ్యాచ్ లను ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు. 

Asia Cup 2023 LIVE ఎలా చూడవచ్చు?

ఆసియా కప్ 2023 మ్యాచ్ లు శ్రీలంక మరియు పాకిస్తాన్ నుండి సెప్టెంబర్ 17 వరకూ ప్రత్యక్ష ప్రసారం చెయ్యబడతాయి. ఈ Asia Cup 2023 LIVE మ్యాచ్ లను Disney Plus Hotstar Mobile App నుండి ఉచితంగా చూడవచ్చు. అయితే, మీరు కేవలం ఒక్క డివైజ్ పైన స్టాండర్డ్ రిజల్యూషన్ (SD) లో మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.     

ఒకవేళ మీరు ఈ మ్యాచ్ లను HD (720p), FHD (1080p) లేదా మరింత ఎక్కువ క్లారిటీ లో చూడలనుకుంటే మాత్రం మీరు Disney Plus Hotstar Premium సబ్ స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. దీనికోసం, FHD Super ప్లాన్ కోసం మీరు సంవత్సరానికి రూ. 899 చెల్లించ వలసి ఉంటుంది. అయితే, మీరు 4K Premium ప్లాన్ తీసుకోవాలనుకుంటే మాత్రం నెలకు రూ. 299 లేదా సంవత్సరానికి రూ. 1,499 చెల్లించ వలసి ఉంటుంది.      

Asia Cup 2023: IND vs PAK మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

Asia Cup 2023 సిరీస్ లో IND vs PAK మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ Kandy లోని పల్లెకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుండి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo