మీ మొబైల్ ఫోన్ లోనే Aadhaar address చేంజ్ చేసుకోవచ్చు.. అది కూడా ఉచితంగా.!
Aadhaar address ని చేంజ్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం
మీ మొబైల్ ఫోన్ లోనే మీ ఆధార్ అడ్రస్ ని చాలా సింపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి
‘
Aadhaar address ని చేంజ్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ మొబైల్ ఫోన్ లోనే మీ ఆధార్ అడ్రస్ ని చాలా సింపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డులో అడ్రస్ చేయించు కోవడం అనేది కామన్ గా ఎక్కువ మందికి ఉపయోగపడే విషయం కాబట్టి ఈ రోజు ఈ విషయం గురించి వివరంగా చర్చిద్దాం.
Aadhaar address చేంజ్ చేసుకోవడం ఎలా?
ఇల్లు మారినప్పుడల్లా అడ్రస్ ను అప్డేట్ చేసుకోవడం అనేది రెగ్యులర్ గా రెంటల్స్ ఉండే ప్రధాన సమస్య. అయితే, చాలా సింపుల్ గా మొబైల్ తోనే ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవడం అనేది వారికి ఉపయోగంగా ఉంటుంది. వాస్తవానికి ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విషయంగా ఉంటుంది.
ఇక ఉచిత విషయానికి వస్తే ఆధార్ కార్డు ని అప్డేట్ చేసుకోవడం డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఉంటుంది. ఎందుకంటే ఆధార్ అప్డేట్ కోసం ఉచిత సర్వీసును డిసెంబర్ 14వ తేదీ వరకు కేంద్రం ఆఫర్ చేస్తోంది.
ఇక మొబైల్ ఫోన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా అనే విషయానికి వస్తే, UIDAI యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డులో అడ్రస్ ను చాలా సింపుల్ గా మొబైల్ లోనే అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం, ముందుగా uidai.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
ఇక్కడ మెయిన్ పేజ్ లో My Aadhaar ట్యాబ్ లోని Update Your Aadhaar పైన నొక్కండి. ఇక్కడ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మరియు ఇందులో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మూడవ ఆప్షన్ అయిన Update Your Address in Your Aadhaar పై నొక్కండి. ఇక్కడ సూచించిన వద్ద మీ కొత్త అడ్రస్ వివరాలు ఎంటర్ చేయండి. అలాగే, మీరు అందించిన అడ్రస్ ను సపోర్ట్ చేసే సపోర్టింగ్ డాక్యుమెంట్ ను PNG, JPEG లేదా PDF ఫైల్ ఫార్మాట్ లో 2MB కంటే సైజు కంటే మించి కుండా తీసుకొని అప్లోడ్ చేయండి.
Also Read: JBL Dolby Soundbar పై లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ వివరాలు అందించిన తర్వాత UIDAI వివరాలు చెక్ చేసి కొత్త అడ్రస్ తో కూడిన కొత్త ఆధార్ కార్డ్ ను కొత్త అడ్రస్ కు అందిస్తుంది.