మీ ఫోన్ లోనే మీ ఆధార్ కార్డ్ అప్డేట్.. ఏ వివరాలు అంటే..!!
ఆధార్ లో కొన్ని వివరాలను అప్డేట్ చెయ్యాలంటే మాత్రం కేవలం మీ ఫోన్ సరిపోతుంది
ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు
ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది
ఆధార్ కార్డ్ ను అప్డేట్ చెయ్యాలంటే కూడా ఆధార్ కేంద్రాలకు వెళ్ళవలసి వస్తుంది. అయితే, ఆధార్ లో కొన్ని వివరాలను అప్డేట్ చెయ్యాలంటే మాత్రం కేవలం మీ ఫోన్ సరిపోతుంది. మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.
ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:
ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి
ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది
దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు
ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి
మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది
మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది
ఇక్కడ Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి
ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి
తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు
OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి
అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.