మీ ఆధార్ కార్డ్ లో వివరాలు మీరే అప్డేట్ చేసుకోవచ్చు.. ఇవి మాత్రమే..!!

Updated on 19-Jul-2022
HIGHLIGHTS

మీ ఆధార్ కార్డ్ లో కొన్ని వివరాలను మీరే అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కార్డులో మీ అడ్రెస్ ను మీరే నేరుగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు

మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు

మీ ఆధార్ కార్డ్ లో కొన్ని వివరాలను మీరే అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, మొత్తం ఆధార్ కార్డ్ ను అప్డేట్ చెయ్యడానికి వీలుండదు మరియు కొన్ని మాత్రమే అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే, ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చెయ్యాడానికి ఆధార్ కేంద్రాలను సంప్రతించవలసి వస్తుంది. అయితే, ఆధార్ కార్డులో మీ అడ్రెస్ ను మీరే నేరుగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.

ఆన్లైన్లో ఆధాaర్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:

ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి

ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది

దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు

ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి

మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది

మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది

ఇక్కడ  Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి

ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి

తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు

OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి

అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :