మీ Aadhaar Card లో అడ్రస్ ను మీరే స్వయంగా అప్డేట్ చేసుకోండి.!

మీ Aadhaar Card లో అడ్రస్ ను మీరే స్వయంగా అప్డేట్ చేసుకోండి.!
HIGHLIGHTS

కొత్త అడ్రస్ లేదా అడ్రస్ అప్డేట్ కోసం ప్రతిసారీ ఆధార్ కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం లేదు

మీ Aadhaar Card లో అడ్రస్ ను మీరే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు

మీ స్మార్ట్ ఫోన్ తో కూడా ఈ అప్డేట్ ను సింపుల్ గా చేసుకోవచ్చు

ఆధార్ కార్డ్ లో ఎక్కువగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండే ఏకైక విషయం, ఆధార్ అడ్రస్ మాత్రమే. రెంట్ లేదా ఉద్యోగ రీత్యా రెగ్యులర్ గా ఊరు మారే వారికి ఇది సుపరిచితమైన విషయం. అయితే, కొత్త అడ్రస్ లేదా అడ్రస్ అప్డేట్ కోసం ప్రతిసారీ ఆధార్ కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ Aadhaar Card లో అడ్రస్ ను మీరే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా ఉండదు. చేతిలో ఉండే మీ స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ అప్డేట్ ను సింపుల్ గా చేసుకోవచ్చు.

Aadhaar Card లో అడ్రస్ అప్డేట్ చేయడం అంత సింపులా?

అవును, Aadhaar Card లో అడ్రస్ అప్డేట్ చేయడం చాలా సింపుల్. యూజర్ కు అవసరమైన పనులు మరియు అప్డేట్స్ ను స్వయంగా చేసుకునే వెసులుబాటును UIDAI అందించింది. ఇందులో ఆధార్ అడ్రస్ అప్డేట్ ఫీచర్ ముఖ్యమైనది. అంతేకాదు, అడ్రస్ ను మార్చుకోవడానికి లేదా అప్డేట్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం కూడా ఉండదు.

Aadhaar Card అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?

ఆధార్ కార్డులో అడ్రస్ ను అప్డేట్ చేయడానికి ముందుగా myaadhaar.uidai.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ Login పైన నొక్కి మీ ఆధార్ మరియు క్యాప్చా ని ఎంటర్ చేసి OTP కోసం రిక్వెస్ట్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి అందుకున్న OTP తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత Address Update ట్యాబ్ పైన నొక్కాలి. ఈ ట్యాబ్ పైన నొక్కగానే ‘అప్డేట్ ఆధార్ ఆన్లైన్’ మరియు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ (HoF) బేస్డ్ అడ్రస్ అప్డేట్ రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి.

Aadhaar Card
Aadhaar Card

ఈ రెండు ఆప్షన్ లలో మొదటి ఆప్షన్, అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ను ఎంచుకోండి. ఈ ఆప్షన్ ను ఎంచుకోగానే ఇక్కడ మీ ప్రస్తుత అడ్రస్ వివరాలు చూపిస్తుంది. ఇక్కడ ప్రస్తుత అడ్రస్ క్రింద కొత్త అడ్రస్ అప్డేట్ కోసం అడిగిన వద్ద వివరాలు పూరించండి. అన్ని వివరాలు అందించిన తర్వాత ఈ అడ్రస్ సరైనదే అని సూచించే అడ్రస్ ప్రూఫ్ స్కాన్ ను లేదా డాక్యుమెంట్ ఫోటో ను అప్లోడ్ చేయండి.

Also Read: AI పెర్ఫార్మెన్స్ ప్రమాణాల కోసం Digit AI-Q స్కోరింగ్ సిస్టమ్ ను ప్రకటిస్తోంది.!

ఇలా అన్ని సరైన వివరాలు అందించిన తర్వాత మీ ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ ను సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత 90 రోజుల్లో మీ కొత్త అడ్రస్ అప్డేట్ చేయబడుతుంది. అప్డేట్ అయిన ఈ కొత్త ఆధార్ కార్డ్ ను ఇదే పోర్టల్ నుండి ఆన్లైన్ లో డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo