మీ ఫోనులో ప్యాట్రన్ లేదా పిన్ లాక్ మర్చిపోతే, అన్లాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి

Updated on 29-Nov-2018
HIGHLIGHTS

ప్యాట్రన్ స్క్రీన్ లేదా పిన్ సెక్యూరిటీ వంటివి మరిచిపోతే, అన్లాక్ చేయడానికి కావాల్సిన సమాచారం ఇక్కడ అందించాము.

నిత్యా జీవితంలో, ప్రతిఒక్కరమూ కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలను మర్చిపోతుంటాము. అదే, మనకు బాగా అవసరమైన కొన్నింటికి సంబంధిన పాస్వర్డులను మరిచిపోతే? నిజంగా ఊహించడానికి కూడా భయమేస్తుంది. ఒక్కోసారి దురదృష్టవశత్తూ,  ఆండ్రాయిడ్ ఫోను లేదా ట్యాబ్లేట్ యొక్క ప్యాట్రన్ లాక్ లేదా పిన్ లాక్ అనుకోకుండా లాక్ అవుతుంది, అందులో మీ తప్పేమి ఉండదు. అయితే, ఈ స్క్రీన్ లాక్ ని అధిగమించి, దానిని తిరిగి తీసుకురావడానికి అనేకమైన మార్గాలున్నాయి. మీరు మీ ఆండ్రాయిడ్ పరికరంలో  ప్యాట్రన్ లాక్ లేదా పిన్ లాక్, మరిచిపోతే ఎమిచేయాలో తెలిపే సమాచారం ఇక్కడవుంది చూడండీ.

ప్రతి పద్దతి గురించి మరింత వివరంగా, ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్లలో  మాత్రమే ఇది పనిచేస్తుంది.

1. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ (ఆండ్రాయిడ్ 2.3 మరియు అంతకంటే పైవాటి కోసం) 

2. స్మార్ట్ లాక్ (ఆండ్రాయిడ్ 5.0 మరియు అంతకంటే పైవాటి కోసం)

3. యూస్ యువర్ గూగుల్ అకౌంట్ (ఆండ్రాయిడ్ 4.4 మరియు అంతకంటే క్రింద వాటికోసం)

4. థర్డ్ పార్టీ సెక్యూరిటీ అప్షన్స్

5. ఫ్యాక్టరీ రీసెట్

మీ పరికరాన్ని పిన్ లాక్ చేస్తే, ఇది సరళమైనది మరియు ఉత్తమైనది కూడా.

మీ ఫోనులో గూగుల్ ఖాతాకి లాగిన్ చేసి ఆండ్రాయిడ్ డివైజ్ నిర్వహణకు లాగిన్ చేయండి మరియు మీ ఖాతాలో సంబంధిత పరికరాల జాబితా నుండి  ప్రశ్నర్ధకమైన  పరికరాన్ని ఎంచుకోండి.   మీకు లాక్ ప్యాట్రన్ ప్రత్యక్షమవుతుంది, ఇప్పుడు మీరు మీ ఫోనులో స్పష్టమైన లాక్ చేయండి. మీ ఫోనును కొత్త కోడుతో లాక్ చేసిన తరువాత, ఇది ఈ కొత్త కొడుకు మీరు మర్చిపోయిన కోడ్ స్థానంలో భర్తీ చేస్తుంది. ఇక మీరు ఈ కొత్త కొడుతో మీ ఫోన్లోకి అనుమతించబడతారు.

అయితే, గూగుల్ యొక్క కొత్త సంస్కరణలు కఠినమైన భద్రతను కలిగివుంటాయి. ఇక్కడ గూగుల్ అకౌంట్ లాగిన్ తో ఫోన్ అన్లాక్ అవుతుంది. అయితే విశిష్టమైన స్మార్ట్ లాక్ కలిగి మీ హోమ్ Wi-Fi కి  కనెక్ట్ చేసినట్లయితే, ఫోన్ స్వయంచాలకంగా అన్లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ప్యాట్రన్ లేదా పిన్ లాక్ మర్చిపోతే మీ హోమ్ వై ఫై తో అన్లాక్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ యొక్క ప్యాట్రన్ లాక్ మరిచిపోతే చింతించాల్సిన అవసరంలేదు, దానిని అన్లాక్ చేయడానికి సరైన మరియు సులభమైన పద్దతి ఇక్కడవుంది.

1. మీ ఫోన్ అన్లాక్ చేయడానికి 5 సార్లు ప్రయత్నించండి

2. ఈ ఐదువ ప్రయత్నం తరువాత కూడా అన్లాక్ అవకుంటే, స్క్రీన్ దుగువన "Forgot Patron" అనికనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి.

3. మీ గూగుల్ ఖాతాకి లాగిన్ చేయండి.

4. మీ గూగుల్ ఖాతాతో లాగిన్ చేసిన తరువాత, కొత్త పిన్, ప్యాట్రన్, లాక్ ,వంటి వాటికి అన్లాక్ చేయగలుగుతారు.

ఈ విధంగా కూడా మీ ఫోన్ అన్లాక్ అవ్వకుంటే, ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. అయితే, దీనివలన మీ డివైజ్ లోని పూర్తి డేటా తెసివేయబడుతుంది కాబట్టి, పైన తెలిపిన అన్ని విధానాలను ప్రయత్నించిన తరువాతే, ఈ విధానాన్ని ఎంచుకోండి.         

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :