వాట్సాప్ వాయిస్ స్టేటస్ ఎలా సెట్ చేసుకోవాలంటే.!
Voice Status ని సెట్ చేసుకోవడం చాలా సింపుల్
మీ స్టేటస్ ఎవరు చూడవచ్చునో ఎంచుకోవచ్చు
చాలా ఉపయోగకరమైన కొత్త ఫీచర్లు చాలా ఉన్నాయి
వాట్సాప్ యప లో కొత్తగా వచ్చిన 'Voice Status' ఫీచర్ ను మీ వాట్సాప్ లో అకౌంట్ లో ఎలా సెట్ చేసుకోవాలో మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. గతకొన్ని నెలలుగా వాట్సాప్ చాలా వేగంగా కొత్త ఫీచర్లను జత చేస్తోంది. ఇందులో చాలా ఉపయోగకరమైన కొత్త ఫీచర్లు చాలా ఉన్నాయి. వీటిలో, ఈ కొత్త 'Voice Status' ఫీచర్ కూడా ఒకటి. ఈ కొత్త ఫీచర్ ను మీరు ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
Whatsapp Voice Status
ఈ ఫీచర్ ను ఉపయోగించడం చాలా సులభం. ఎందుకంటే, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న వాట్సాప్ యాప్ స్టేటస్ మాదిరిగానే ఈ కూడా వాయిస్ స్టేటస్ ఫీచర్ కూడా ఉంటుంది. అయితే, ఈ స్టేటస్ మరియు వాయిస్ స్టేటస్ మధ్య చిన్న తేడా మాత్రమే ఉంటుంది. వాట్సాప్ లో వాయిస్ స్టేటస్ ను సెట్ చేసుకోవడానికి, మీరు మీ స్టేటస్ క్రియేట్ చేసుకోవడం కోసం Status పైఉన్న నొక్కిన తరువాత క్రింద కనిపించే పెన్ బటన్ ద్వారా మీ వాయిస్ స్టేటస్ ను పోస్ట్ చెయ్యవచ్చు.
స్టేటస్ లో పెన్ బటన్ పైన నొక్కిన తరువాత ఇక్కడ కనిపించే మైక్ బటన్ ను లాంగ్ ప్రెస్ చేసి మీ వాయిస్ ను రికార్డ్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ గా క్రియేట్ చెయ్యవచ్చు. అంతే, చాలా సింపుల్ గా వాయిస్ స్టేటస్ ను పోస్ట్ చేసుకోవచ్చు.