SBI యొక్క ఈ కొత్త సర్వీస్ గురించి మీకు తెలుసా?

Updated on 06-Sep-2022
HIGHLIGHTS

SBI బ్యాంక్ తన కష్టమర్ల కోసం మరొక సౌకర్యవంతమైన సర్వీస్ ను ప్రారంభించింది

SBI అకౌంట్ హోల్డర్స్ ఇంటి నుండి కదలకుండానే కొన్ని పనులను చక్కబెట్టవచ్చు

ఈ సర్వీస్ లను మీరు పొందాలంటే మీరు ముందుగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి

SBI బ్యాంక్ తన కష్టమర్ల కోసం మరొక సౌకర్యవంతమైన సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా SBI అకౌంట్ హోల్డర్స్ ఇంటి నుండి కదలకుండానే కొన్ని పనులను చక్కబెట్టవచ్చు. అదే SBI Whatsapp సర్వీస్ మరియు దీని ద్వారా అకౌంట్ హోల్డర్లు బ్యాంక్ దారిపట్టకుండా వాట్సాప్ లోనే తమ బ్యాంక్ పనులు నిర్వహించవచ్చు. దీని అనుగుణంగానే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ బాలన్స్ లేదా మినీ స్టేట్మెంట్ వంటివి వాట్సాప్ లో పొందే వీలును కల్పించింది. అంతేకాదు, రానున్న కాలంలో మరిన్ని ఫీచర్లను ఇందులో జత చేయనున్నట్లు కూడా తెలిపింది.

అయితే, ఈ సర్వీస్ లను మీరు పొందాలంటే, మీరు ముందుగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మరి ఆ స్టెప్స్ ఏమిటో మరియు మీరు మీ వాట్సాప్ లో మీ SBI బ్యాంక్ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చునో తెలుసుకుందామా.

వాట్సాప్ లో SBI బ్యాంక్ సర్వీస్ కోసం ఇలా చేయండి

వాట్సాప్ లో SBI బ్యాంక్ సర్వీస్ పొందాలంటే, ముందుగా నంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం, WAREG అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చిన తరువాత మీ అకౌంట్ నంబర్ ను కూడా టైప్ చేసి 7208933148 నంబర్ కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మెసేజ్ చేయాలి. ఇలా మీ నంబర్ ను రిజిస్టర్ చేసుకున్న తరువాత, మీకు తిరిగి మీ నంబర్ పైన వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అంటే, మీరు తిరిగి రిప్లై ఇవ్వడం ద్వారా మీ కావాల్సిన సర్వీస్ లను పొందవచ్చు.

మీకు SBI బ్యాంక్ యొక్క వాట్సాప్ నంబర్ 90226 90226 నుండి వాట్సాప్ మెసేజిలు మరియు సర్వీస్ లు అందుతాయి. మొదటి మీరు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా సేవలను కోనసాగించవచ్చు. ప్రస్తుతం, ఈ వాట్సాప్ సర్వీస్ నుండి 'Balance Enquiry' మరియు 'Mini Statement' సర్వీస్ లు మాత్రమే అంధుబౌట్లో వున్నాయి. అయితే, త్వరలోనే మరిన్ని సర్వీస్ లను ఇందులో జత చేయనునట్లుగా SBI తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :