Aadhaar Biometric Lock: మీ అనుమతి లేకుండా మీ ఆధార్ ని ఎవరూ టచ్ చెయ్యలేరు.!
ఆధార్ బయోమెట్రిక్ లాక్ అనేది యూజర్లు వారి ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ లాక్ ఫీచర్
Aadhaar Biometric Lock తో బయోమెట్రిక్స్ పాక్షికంగా లాక్ చేసుకోవచ్చు
ప్రైవసీ మరియు గోప్యతకి మరింత బలం చేకూర్చడం కోసం UIDAI ఈ సర్వీస్ ను అందించింది
Aadhaar Biometric Lock: మీ అనుమతి లేకుండా మీ ఆధార్ ని ఎవరూ టచ్ చెయ్యకుండా చేయాలంటే ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ను సెట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ ను UIDAI చాలా చాలా కాలంగా ఆఫర్ చేస్తోంది. యూజర్ యొక్క ఆధార్ సెక్యూరిటీ మరింత పెంచేందుకు ఈ ఫీచర్ దోహదం చేస్తుంది. అయితే, ఈ ఫీచర్ తో ఒక చిక్కు కూడా ఉంది. అందుకే, ఈరోజు ఆధార్ బయోమెట్రిక్ ఫీచర్ మరియు దీనిలో ఉండే ఆ చిక్కు మరియు దానికి తగిన ఉపాయం వంటి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Aadhaar Biometric Lock అంటే ఏమిటి?
ఆధార్ బయోమెట్రిక్ లాక్ అనేది యూజర్లు వారి ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ ను లాక్ లేదా ఆన్లైన్ చేసుకోవడానికి UIDAI అందించిన ఒక సర్వీస్. ఈ సర్వీస్ తో యూజర్లు చాలా సులభంగా వారి బయోమెట్రిక్స్ పాక్షికంగా లాక్ చేసుకోవచ్చు మరియు అవసరం ఉన్నపుడు అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఆధార్ యూజర్ ప్రైవసీ మరియు గోప్యతకి మరింత బలం చేకూర్చడం కోసం UIDAI ఈ సర్వీస్ ను అందించింది.
Aadhaar Biometric Lock తో ఏ డేటా ను లాక్ చేయవచ్చు?
ఆధార్ బయోమెట్రిక్ లాక్ తో ఫింగర్ ప్రింట్, ఐరిష్ మరియు ఫేస్ వంటి బయోమెట్రిక్ స్కాన్ లు లాక్ అవుతాయి. ఈ లాక్ ను సెట్ చేసిన తర్వాత ఆధార్ యూజర్ అయినా సరే బయోమెట్రిక్ పద్దతి ద్వారా అథెంటికేషన్ ను నిర్వహించలేరు. సింపుల్ గా చెప్పాలంటే, ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసిన తర్వాత ఆ లాక్ తొలగించే వరకు యూజర్ ఎటువంటి బయోమెట్రిక్ స్కాన్ లను చెయ్యలేరు.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఎలా చెయ్యాలి?
ఆధార్ బయోమెట్రిక్ లాక్ ని సెట్ చేయడానికి, ముందుగా UIDAI అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత ఆధార్ సర్వీస్ లలో కనిపించే ఆధార్ లాక్/ అన్లాక్ ట్యాబ్ పైన నొక్కాలి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ద్వారా లాక్ సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది.
Also Read: భారీ ఫీచర్ లతో ఈరోజు విడుదలకు సిద్ధమైన Realme GT6 స్మార్ట్ ఫోన్.!
ఏమిటా సమస్య?
ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ని సెట్ చేయడానికి లేదా అన్లాక్ చెయ్యడానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే, ఈ నెంబర్ పైన అందుకునే OTP ద్వారా మాత్రమే ఈ ఫీచర్ ను లాక్ లేదా అన్లాక్ చేసే వీలుంటుంది. ఒకవేళ యూజర్ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే, కొత్త SIM కార్డు కోసం ఆధార్ అథెంటికేషన్ చేయడం కుదరదు. అందుకే, ఈ ఫీచర్ ఉపయోగించే ముందు అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.
అయితే ఏమి చెయ్యాలి?
ఒకవేళ ఈ ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ను సెట్ చేసుకున్న తర్వాత యూజర్ మొబైల్ నెంబర్ పోగొట్టుకున్న లేదా మొబైల్ నెంబర్ మార్చుకున్నా, దగ్గరలోని ప్రధాన ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి తగిన సలహాలతో అన్లాక్ చేసుకునే వీలుంటుంది.