టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ పంపండి.. ఎలాగంటే.!!

టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ పంపండి.. ఎలాగంటే.!!
HIGHLIGHTS

Whatsapp లో మీకు తెలియని చాలా ట్రిక్స్ దాగున్నాయి

టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ ను సెండ్ చెయ్యవచ్చు

ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే సరిపోతుంది

ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రచుర్యాన్ని చోరగొన్న చాటింగ్ యాప్ Whatsapp లో మీకు తెలియని చాలా ట్రిక్స్ దాగున్నాయి. వాటిలో అన్ని అందరికి తెలియక పోవచ్చు. ఈరోజు మనం అటువంటి ఒక చిన్న ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ ట్రిక్స్ కొందరికి తెలిస్తే, మరికొందరికి తెలియకపోవచ్చు. అదేమిటంటే, టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ ను సెండ్ చెయ్యవచ్చు. అంటే, మీరు మీ వాట్సాప్ నుండి టైప్ చెయ్యకుండానే చాటింగ్ లేదా మెసేజ్ పంపవచ్చు. దీనికోసం ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే సరిపోతుంది.

ఇప్పటికే మీరు మీ వాట్సాప్ ల ఈ  ఫీచర్ ను ఉపయోగిస్తుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు కనుక ఈ ఫీచర్ ను మీ ఫోన్ లో మీ వాట్సాప్ తో ఎలా  ఉపయోగించాలో తెలియక పొతే, ఇక్కడ నుండి ఈజీగా తెలుసుకోవచ్చు మరియు మీరు కూడా మీ వాట్సాప్ మెసేజిలను టైప్ చెయ్యకుండానే పంపించవచ్చు. మరి ట్రిక్ ఎలా చెయ్యాలో చూద్దామా. 

ముందుగా, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ మరియు iOS ఫోన్లలో సిరి సహాయంతో మెసేజింగ్ యాప్ ఒపెన్ చెయ్యకుండానే మెసేజిలను పంపించవచ్చు. అలాగే, మెసేజింగ్ యాప్ తెరవకుండానే మెసేజిలను చదివే అవకాశం వుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఫీచర్ ను వాట్సాప్ కూడా తీసుకొచ్చింది.

మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే గూగుల్ యస్ మరియు వాట్సాప్ నోటిఫికేషన్ యాలకు యాక్సెస్ ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అవసరం లేదనుకుంటే సెట్టింగ్ లోకి వెళ్లి ఎప్పుడైనా యాక్సెస్ ను నిలిపి వేయవచ్చు. మీ ఫోన్లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే ఈ క్రింద విధంగా చేయండి.

వాట్సాప్ లో  ఈ ఫీచర్ కోసం ఇలా చేయండి

ముందుగా మీ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయాలి. గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అయిన తరువాత మీరు మీ కాంటాక్ట్స్ లో ఎవరికి వాట్సాప్ మెసేజ్ పంపించాలనుకుంటున్నారో సూచించండి. తరువాత, గూగుల్ అసిస్టెంట్ మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారో, లేదా మీరు ఏమి రాయాలనుకుంటున్నారో అడుగుతుంది. తరువాత, వర్చువల్ అసిస్టెంట్ మీరు చెప్పిన టైప్ చేసి చూపుతుంది. ఈ మెసేజ్ ను Send చెయ్యమని చెప్పిన వెంటనే మెసేజ్ సెండ్ చేయబడుతుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo