మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రైన్ అవుతోందా..ఇలా ఒకసారి ట్రై చెయ్యండి.!

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రైన్ అవుతోందా..ఇలా ఒకసారి ట్రై చెయ్యండి.!
HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ లో యూజర్లకు ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ డ్రైన్

చిట్కాలతో బ్యాటరీ డ్రైన్ సమస్య నుండి ఇట్టే బయట పడవచ్చు

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఉపయోగపడే చిట్కాలు

స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుండా పొద్దుపోని రోజులు వచ్చేశాయి. అయితే, స్మార్ట్ ఫోన్ లో యూజర్లకు ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ డ్రైన్. అయితే, ఎటువంటి తర్డ్ పార్టీ అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్ లో ఉండే అనేక ఫీచర్లు మరియు ఇతర చిట్కాలతో బ్యాటరీ డ్రైన్ సమస్య నుండి ఇట్టే బయట పడవచ్చు. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఉపయోగపడే ఈ చిట్కాలు ఈరోజు ఇక్కడ చూడవచ్చు.

1. స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించండి 

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా బ్యాటరీని ఉపయోగించేది ఫోన్ యొక్క స్క్రీన్. ఎండ  లేదా అధిక వెలుగులో ఉన్నప్పుడు స్క్రీన్ ఆటో బ్రైట్నెస్  మోడలో ఉన్నట్లయితే, ఎక్కువ పవర్ ఉపయోగిస్తుంది. అందుకే, అటువంటి సమయాల్లో మీ స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించండి.              

2. యాప్స్ 

స్మార్ట్ ఫోన్ లో ఉన్న కొన్ని యాప్స్ బ్యాటరీని డ్రైన్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. దాదాపుగా అన్ని షోషల్ మీడియా యాప్స్ కూడా బ్యాగ్ రౌండ్ లో రాం అవుతూ ఉంటాయి. అందుకే, మీ పని అయిపోయిన తరువాత వాటిని అన్ని యాప్స్ ని క్లోజ్ చేయడం మంచిది. అలాగే, మీకు అవసరం లేని యాప్స్ ని గుర్తించి ఉపయోగంలో లేని వాటిని డిలీట్ చెయ్యండి.

3. నోటిఫికేషన్స్ 

మీ స్మార్ట్ ఫోన్ లో పుష్ నోటికేషన్స్ ను ఆఫ్ చేయడం ద్వారా కూడా మీ ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రైన్ కాకుండా చూడవచ్చు. దీనికోసం మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్స్  ట్యాబ్ లోకి వెళ్లి టోగుల్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

4. పవర్ సేవింగ్ మోడ్ 

ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న 'Power Saving' మోడ్ ను ఉపయోగించండి. ఈ ఫీచర్ ను ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ చాలా తక్కువగా నియోగం అవుతుంది. 

5. ఫోన్ లాక్ చెయ్యడం 

మీరు మీ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించిన తరువాత ప్రక్కన పెట్టె ముందుగా ఫోన్ లాక్ చెయ్యండి. ఎందుకంటే, మీరు ఫోన్ లాక్ చెయ్యకుండా ప్రక్కన పెడితే, ఫోన్ స్క్రీన్ ఆన్ లోనే ఉంటుంది. ఫోన్ లాక్ అవ్వడానికి సమయం పడుతుంది కాబటికి, మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని డ్రైన్ చేస్తుంది.

ఇలా ఈ చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఎక్కువ సమయం నిలపడమే కాకుండా, మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ దీర్ఘకాలం మన్నేలా కూడా చూసుకోవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo