Paytm FASTag: పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ పోర్ట్ లేదా డియాక్టివేషన్ కోసం చూస్తున్నారా.!

Updated on 01-Feb-2024
HIGHLIGHTS

పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ హోల్డర్స్ ఆలోచనలో పడ్డారు

పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్స్ పైన యూజర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

పోర్ట్ చెయ్యాలా లేదా మొత్తానికే తీసెయ్యాలా అనే డైలమాలో పడ్డారు పేటిఎం యూజర్లు

Paytm FASTag: పేటిఎం పైన RBI తీసుకున్న కొత్త నిర్ణయంతో పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ హోల్డర్స్ ఆలోచనలో పడ్డారు. టోల్ గేట్స్ వద్ద ఎటువంటి పడిగడుపు పడే పని లేకుండా చేసిన తమ పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్స్ పైన యూజర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముక్కుసూటిగా చెప్పాలంటే, తమ పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లను పోర్ట్ చెయ్యాలా లేదా మొత్తానికే తీసెయ్యాలా అనే డైలమాలో పడ్డారు పేటిఎం యూజర్లు.

Paytm FASTag:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను తుంగలో తొక్కిన కారణంగా ఫిబ్రవరి 29 నుండి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క చాలా సర్వీస్ లు నిలిపివేయాలని ఆర్డర్ వేసింది. ముఖ్యంగా కొత్త అకౌంట్స్ ను మరియు కొత్త డిపాజిట్స్ ను సేకరించ కూడదని ఆంక్షలు విధించింది. అంతేకాదు, పేటిఎం వాలెట్ లో మరియు టాప్ అప్స్ ను కూడా ఫిబ్రవరి 29 తరువాత నిలిపి వేయనున్నట్లు క్లియర్ గా చెప్పింది.

పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వారు టోల్ గెట్ పాస్ చేసినప్పుడు ఆటొమ్యాటిగ్గా పేటిఎం వాలెట్ నుండి టోల్ గెట్ అమౌంట్ కట్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ అవకాశం ఎటువంటి అంతరాయం లేకుండా కోసంసాగుతున్నా, ఫిబ్రవరి 29 తరువాత ఏమవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు.

పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ఏమవుతుంది?

RBI తెలిపిన ప్రకారం, ఫిబ్రవరి 29 తరువాత పేటిఎం వాలెట్ లో అమౌంట్ ను యాడ్ చెయ్యడం వీలుపడదు. కాబట్టి, పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ తో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు.

Also Read: లేటెస్ట్ Vivo స్మార్ట్ ఫోన్స్ పైన భారీ తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!

పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ను పోర్ట్ చేయవచ్చా?

వాస్తవానికి, పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ కోసం ప్రత్యేకమైన రిజిస్టర్ నెంబర్ అందించ బడుతుంది మరియు ఈ అకౌంట్ ను మరొక పేటిఎం నెంబర్ కు మాత్రమే పోర్ట్ చేసుకునే వీలుంటుంది. అయితే, మీరు కలిగి వున్న అకౌంట్ కు కొద మీరు ఈ ఫాస్ట్ ట్యాగ్ ను పోర్ట్చేసుకునే వీలుంది.

అయితే, పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ను డీయాక్టివేట్ చేసి కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకునే అవకాశం మరింత సులభంగా ఉంటుంది. ఒకవేళ మీరు మీ కోరుకునే బ్యాంక్ అకౌంట్ కు పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ను పోర్ట్ చెయ్యదలచుకుంటే, ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేసిన వారు చెప్పిన సూచనలు ఫాలో అవ్వవలసి ఉంటుంది.

ఒకవేళ పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ను డీయాక్టివేట్ చెయ్యాలనుకుంటే మాత్రం పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ కేటగిరీలోకి వెళ్లి 24/7 హెల్ప్ సెక్షన్ లో ఫాస్ట్ ట్యాగ్ క్లోజింగ్ కోసం రిక్వెస్ట్ ను రైజ్ చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :