ఈ రోజు నుండే Jio సిమ్ బ్రాండ్ తో సంబంధం లేకుండా అన్ని 4G ఫోనులకు అఫీషియల్ గా welcome ఆఫర్ తో రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ సిమ్ తీసుకోవటానికి స్టోర్ కు వెళ్ళటం జరిగింది ఈ రోజు. ఆ ప్రాసెస్ అంతా – స్టోర్ కు వెళ్ళే ముందు ఏమి చేయాలి, వెళ్ళిన తరువాత వాళ్ళు ఏమి అడుగుతారు వంటివి.. ఈ లింక్ లో తెలపటం జరిగింది.
అయితే చాలా మందికి స్టోర్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవటం కూడా ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది. సో వారి కోసం ఈ ఆర్టికల్. చాలా సింపుల్ గా మీ దగ్గరిలో ఉన్న Jio స్టోర్ గురించి తెలుసుకోగలరు.
దగ్గరిలోని Jio స్టోర్స్ ఎక్కడ ఉన్నాయని ఏలా తెలుసుకోవాలి?
- మీ PC లో లేదా మొబైల్ లో www.jio.com ( link ) ను ఓపెన్ చేయండి.
- మొబైల్ లో ఓపెన్ చేస్తే, క్రిందకు కంప్లీట్ గా స్క్రోల్ చేయండి page ను.
- మీకు support అని కనిపిస్తుంది. దానిపై టాప్ చేయండి.
- ఇప్పుడు మీకు ఏరియా లేదా pincode ను ఎంటర్ చేయమని అడుగుతుంది. దాని క్రింద కిలోమీటర్స్ (KM) కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎంత తక్కువ KM సెలెక్ట్ చేసుకుంటే అంత దగ్గరిలోని స్టోర్ అడ్రెస్ ఇస్తుంది. ఇప్పుడు ఏరియా పేరు పక్కన సర్చ్ బటన్ టాప్ చేస్తే స్టోర్స్ అడ్రెస్ లిస్టు వస్తాయి. (అయితే కొన్ని రిమోట్ ఏరియాస్ లేదా చిన్న టౌన్స్ అయితే ఎక్కువ కిలోమీటరర్లు ఎంటర్ చేయండి. ఫర్ మీరు తక్కువ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే అడ్రెస్ లు ఏమి రానప్పుడు 10KM అని ఎంటర్ చేసి సర్చ్క్ చేస్తే 10KM లోపల పరిధిలో ఉన్న స్టోర్స్ ను వెతుకుతుంది.)
- లిస్టు పై టాప్ చేస్తే map view లో స్టోర్ యొక్క కంప్లీట్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. అక్కడే get directions అని కూడా ఉంటుంది. దాని పై టాప్ చేస్తే స్టోర్ కు వెళ్ళటానికి రూట్ కూడా చెబుతుంది.అంతే! మీకు Jio పై ఉన్న డౌట్స్ అన్నిటికీ సమాధానాలు తెలపటం జరిగింది. సో చూడని వారు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.