Voter ID దొరకడం లేదా, ఆన్లైన్ లో సింపుల్ గా డిజిటల్ ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి.!
2024 ఎలక్షన్ సీజన్ మొదలయ్యింది
ఓటు హక్కును వినియోగించు కోవడానికి అవసరమైన ముఖ్యమైన పత్రం వారి Voter ID
డిజిటల్ ఓటర్ కార్డ్ ద్వారా ఓటర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు
2024 ఎలక్షన్ సీజన్ మొదలయ్యింది మరియు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ప్రజలు తమ ఓటు హక్కను వినియోగించుకుని దేశాన్ని భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఓటర్ లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి అవసరమైన ముఖ్యమైన పత్రం వారి Voter ID. ఎలక్షన్ సమయంలో ఏదైనా కారణం వలన ఓటర్ కార్డు కనిపించ పోయినట్లయితే, ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోలేరు.
Digital Voter ID
ఓటర్ కార్డ్ లేకున్నా ఓటు హక్కును వినియోగించు కోవడానికి అవకాశం వుంది. అదేమిటంటే, డిజిటల్ ఓటర్ కార్డ్ ద్వారా ఓటర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అందుకే, ఓటర్ లు వారి డిజిటల్ ఓటర్ కార్డ్ లను వారి ఫోన్ లో కలిగి ఉండడం మంచిది. అందుకే, డిజిటల్ ఓటర్ కార్డ్ లను సింపుల్ గా ఆన్లైన్ లో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
Digital Voter ID ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
డిజిటల్ ఓటర్ ఐడి కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. దీనికోసం ముందుగా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ ఐడి కార్డ్స్ తీసుకు వచ్చిన అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in/ వెబ్సైట్ ను ఓపెన్ చెయ్యాలి. ఇందులో మీకు హోమ్ పాజ్ కనిపిస్తుంది. అందులో, కుడి వైపు చివరిలో E-Epic Download అనే బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన క్లిక్ చెయ్యాలి మరియు వెంటనే మీ లాగిన్ పేజ్ కి మిమ్మల్ని తీసుకు వెళుతుంది.
Also Read: iQOO 12 5G Anniversary Edition తెచ్చిన ఐకూ.. సేల్ డేట్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
మీకు మీ మొబైల్ నిమ్బర్ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ పైన మీరు లాగిన అవ్వకుంటే, మీ మొబైల్ నెంబర్ తో Sign Up అవ్వవచ్చు. దీనికోసం మీ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. లాగిన్ చేసిన తరువాత పైన తెలిపి విధంగా E-Epic Download బాక్స్ పైన నొక్కండి. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
కొత్త పేజ్ లో మీ ఓటర్ ఐడి EPIC నెంబర్ కోసం ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మీ EPIC నెంబర్ ను ఎంటర్ చేసి, క్రింద బాక్స్ లి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. యల్ చేసిన తరువాత ప్రక్కనే ఉన్న Search బాక్స్ పైన నొక్కాలి. ఇక్కడ మీ ఓటర్ ఐడి యొక్క కంప్లీట్ వివరాలు అంధించ బడతాయి. ఇక్కడ క్రింద అడిగిన వద్ద OTP కోసం రిక్వెస్ట్ ను పంపించాలి.
ఇపుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP అందించి బడుతుంది. ఈ OTP ని ఎంటర్ చెయ్యగానే, మీ డిజిటల్ ఓటర్ ఐడి డౌన్ లోడ్ అవుతుంది.