మీ ఆధార్ కార్డ్ పోయిందా..సింపుల్ గా పొందే మార్గం తెలుసుకోండి.!

మీ ఆధార్ కార్డ్ పోయిందా..సింపుల్ గా పొందే మార్గం తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే చాలా సింపుల్ గా మరలా తిరిగి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

UIDAI పోర్టల్ ద్వారా తిరిగి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ఆన్లైన్ లో ఆధార్ డౌన్ లోడ్ చాలా సింపుల్

దేశం ప్రజలకు ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ లేదా పత్రం గా ముందు వరుసలో ఉండేది ఆధార్ కార్డ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటిది ఆ ఆధార్ కార్డ్ ను అనుకోకుండా పోగొట్టుకుంటే ఏమి చేయాలి? అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా. వాస్తవానికి, ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే చాలా సింపుల్ గా మరలా తిరిగి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐడి ఎలా చెయ్యాలో ఇక్కడ తెలుసుకోండి. 

మీరు మీ ఆధార్ కార్డ్ ను అనుకోకుండా పోగుట్టుకుంటే, UIDAI పోర్టల్ ద్వారా తిరిగి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు మీ UIDAI సైట్ ను ఓపన్ చేయండి. ఈ సైట్ లో పైన కనిపించే ట్యాబ్ లలో మొదటి ట్యాబ్ My Aadhaar పైన నొక్కండి. ఇక్కడ మీకు 'get Aadhaar' లో క్రింద 'డౌన్ లోడ్ ఆధార్' అప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఎంచుకోండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ని ఎంటర్ చేయడం ద్వారా OTP తో మీరు లాగిన్ అవ్వవచ్చు.

తరువాత,  ఎన్రోల్ మెంట్ లేదా ఆధార్ నెంబర్, పేరు, పిన్ కోడ్ లను ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చ ని ఎంతటి చేసి OTP పైన నొక్కాలి. ఇప్పుడు మీరు మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ పైన అందుకున్న OTP ని ఎంటర్ చేసిన తరువాత మీ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.            

ఆధార్ నంబర్ తెలియక పొతే చెయ్యాలి?

ఒకవేళ మీకు మీ ఆధార్ నంబర్ కూడా గుర్తు లేకున్నా మీరు మీ ఆధార్ ను డౌన్ లోడ్ చేస్కునే వీలుంది. దీనికోసం My Aadhaar పేజ్ లో  కనిపించే అప్షన్ లలో 'Aaadhar Services' లో Retrive Lost Or EID/UID అప్షన్ ను ఎంచుకోండి. ఈ అప్షన్ ఎంచుకున్న తరువాత ఇక్కడ మీ పేరు మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్రింద కనిపించే Capcha ను కూడా ఎంటర్ చెయ్యాలి. ఇలా చేసిన వెంటనే మీ ఆధార్ తో అనుసంధానమైన రిజిష్టర్ మొబైల్ నంబర్ పైన OTP ని అందుకుంటారు.

ఇలా మీరు చేసిన తరువాత మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ పైన ఎన్రోల్ మెంట్ వివరాలను అందుకుంటారు. అంటే, పైన తెలిపిన ఆధార్ డౌన్ లోడ్ ప్రోసెస్ తో మీ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo