Aadhaar Card ప్రత్యేకమైన గుర్తింపు పత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే, మన దేశంలో ఎటువంటి పనులకైనా ముందుగా అడిగేది ఆధార్ కార్డ్ ని మాత్రమే అందరికీ తెలిసిన విషయం. అయితే, ఆధార్ కార్డ్ ను పోగొట్టుకున్నా లేదా అవసరమైన సమయానికి కన్పించక పోయినా ఇబ్బంది పడవలసి వస్తుంది. మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఆధార్ ను ఆన్లైన్ లో ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే, మొబైల్ నెంబర్ లింక్ అవ్వకున్నా కూడా ఆన్లైన్ లో ఆధార్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ లో ఆధార్ కార్డ్ ను డౌ లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం ముందుగా UIDAI సైట్ ను ఓపెన్ చెయ్యాలి. ఓపెన్ చేసిన తరువాత హోమ్ పేజ్ లో కనిపించే My Aadhaar బార్ లోకి వెళ్ళాలి. ఒకవేళ మీరు తెలుగులో ఈ సైట్ ను చూడాలనుకుంటే, కుడి వైపు ఎగువ మూలలో లాంగ్వేజ్ ఆప్షన్ ను ఎంచుకునే మీ తెలుగు భాషను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న తరువాత సైట్ పూర్తిగా తెలుగులో కనిపిస్తుంది.
ఈ UIDAI సైట్ లో పైన తెలిపిన విధంగా లాంగ్వేజ్ మార్చుకొన్న తరువాత, నా ఆధార్ బారి లోకి వెళ్ళాలి. వెళ్లిన తరువాత ఇక్కడ ‘మీ ఆధార్ ను అప్డేట్ చెయ్యండి’ అని కనిపించే బార్ క్రింద మూడవ ఆప్షన్ ‘ ఆధార్ ని డౌన్ లోడ్ చేసుకోండి’ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన నొక్కాలి మరియు నొక్కిన తరువాత My Aadhar కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
Also Read: Tecno Pova 6 Pro: డిఫరెంట్ డిజైన్ మరియు 24GB RAM తో వస్తోంది.!
ఇక్కడ ‘నా ఆధార్ కు స్వాగతం’ పేజ్ కనిపిస్తుంది మరియు ఇక్కడ క్రిందకు స్క్రోల్ చేస్తే ‘డౌన్ లోడ్ ఆధార్’ అని కనిపిస్తుంది. దీని పైన నొక్కండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ మరియు అక్క కనిపించే క్యాప్షన్ ను ఎంటర్ చేసి OTP కోసం రిక్వెస్ట్ చేయండి. ఒకవేల మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే, OTP లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు పంపించ బడుతుంది. లేదంటే, ‘నా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయబడ లేదు’ (Order Aadhaar Reprint) అనే ఆప్షన్ లోకి వెళ్లి దాని పై నొక్కండి.
ఇక్కడ మీరు మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి. ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన మొబైల్ నెంబర్ కు OTP అందించ బడుతుంది. ఈ OTP నెంబర్ ను ఎంటర్ చేయండి. అంతే, మీ ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ అవుతుంది.