మీ ఇంట్లోనే బ్లాక్ అండ్ వైట్ ఫోటో ని కలర్ గా మార్చుట ఎలా ?
ఒక కలర్ ఫోటో ని సులభముగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా మార్చవచ్చు. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకోండి , మరియు ఏదయినా ఫోటో ఎడిటర్ లో అప్డేట్ చేయండి. మరియు బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ అప్లై చేయండి. అంతే పని పూర్తయిపోయినట్టే ,మీ కలర్ ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో గా మారిపోతుంది. ఇది చేయుట చాల సులభం . కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ని కలర్ గా మార్చుట అనేది మీకు కొంచెం కష్టమవుతుంది.
సాధారణంగా మనందరిదగ్గర పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ వుండే ఉంటాయి . వాటితో మన అనుబంధాలు ముడిపడివుంటాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ గా మార్చుట కాస్తంత కష్టతరమైన పద్దతి. ఈ ఆర్టికల్ లో మేము మీకు కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్పబోతున్నాము . వాటి ద్వారాగా ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ గా మార్చుట కొంచెం సులభం అవుతుంది.
ఫోటో షాప్ :
ఫోటో షాప్ ఎలాంటి సాఫ్ట్ వేర్ అంటే దీని సహాయంతో కంప్యూటర్ పైన ఒక ఫోటోని ఏమైనా చేయవచ్చు. ఫోటోని ఏవిధముగా నైనా మార్చవచ్చు. మరియు మీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ గా మార్చవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ లో అందుబాటులో వుండే అన్ని టూల్స్ గురించి తెలుసుకోండి. మరియు మీ ఫొటోస్ ని రంగులమయం చేసుకోండి.
Colorize Photo Converter Web app :
ఈ ఆన్లైన్ సర్వీస్ మీకు మీ ఫొటోస్ లో కలర్స్ నింపుకొనే సౌకర్యం కల్పిస్తుంది. దీనిలో మీరు పోర్ట్రయిట్స్ మరియు సీనరీస్ ను చాలా సులభముగా కలర్ చేయవచ్చు . దీనికోసం మీదగ్గర ఒకబ్లాక్ అండ్ వైట్ ఫోటో తో పాటుగా ఒక కలర్ ఫోటో కూడా కలిగి ఉండాలి .