మీ ఆధార్ – బ్యాంక్ లింక్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

మీ ఆధార్ - బ్యాంక్ లింక్ వివరాలు చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు

మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ ను కలిగి ఉంటే సరిపోతుంది

బ్యాంక్ కు వెళ్లే అవసరం లేకుండా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు

మీ ఆధార్ – బ్యాంక్ లింక్ వివరాలు తెలుసుకోవడం ఎలా? అయితే, మీరు ఆన్లైన్లో లో చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు మీ ఆధార్ నంబర్ మరియు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్  ను కలిగి ఉంటే సరిపోతుంది. వాస్తవానికి,కొన్ని సమయాల్లో ఏ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లో ఉన్న మొబైల్ నంబర్ తో లింక్ చేశాము అని తెలియక చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. అందుకే, బ్యాంక్ కు వెళ్లే అవసరం లేకుండా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లకు లింక్ అయ్యిందనే విషయాన్ని ఆన్లైన్లో ఎలా చెక్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

మీ ఆధార్ – బ్యాంక్ లింక్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

ముందుగా www.uidai.gov.in వెబ్సైట్ ను సందర్శించాలి. ఈ వెబ్సైట్ లో మొదటి అప్షన్ My Aadhar లోనికి వెళ్ళి 'Check Your Aadhaar and Bank Account' అనే అప్షన్ ను ఎంచుకోవాలి. ఈ అప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు. ఈ పేజ్ లో అడిగిన వద్ద మీ ఆధార్ నంబర్ ను మరియు ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చెయ్యాలి.

తరువాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. ఈ OTPని UIDAI వెబ్‌సైట్‌లో నమోదు చెయ్యాలి. ఈ స్టెప్ తరువాత మీరు లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అంటే, మీరు లాగిన్ అయినప్పుడు మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మీ బ్యాంక్ ఖాతా వివరాలన్నీకూడా అక్కడ చూడవచ్చు. ఈ విధంగా మీ ఆధార్ తో లింక్ చెయ్యబడిన అన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు ఇంట్లో కూర్చోని ఆన్లైన్లో చాలా సులభంగా తెల్సుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :