సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందుగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Updated on 30-Aug-2022
HIGHLIGHTS

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందుగా ఇలా చెక్ చెయ్యండి

ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు నిర్ధారించుకోవడం మంచిది

సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం ఉత్తమం

కొత్త ఫోన్ ధరలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ ఫోన్ వస్తుందని, చెక్ చెయ్యకుండా తీసుకుంటున్నారా? అయితే, మీకు కొత్త తలనొప్పి మొదలుకావచ్చు. ఎందుకంటే, ఫోన్ ఒరిజినల్ అయితే మీకు ఎటువంటి సమస్య ఉండదు, ఒకవేళ కొట్టుకొచ్చిందయితే ఇక మీ పని అంతే. అందుకే, మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా  ఆ ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు నిర్ధారించుకోవడం మంచిది. అంటే, మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం నూరుకు నూరు శాతం ఉత్తమం.

ఎలా చెక్ చెయ్యాలి ?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేక డూప్లికేట్ లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నదా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.

ఈ క్రింది విధంగా చెక్ చెయ్యొచ్చు

ముందుగా CEIR పోర్టల్ లోకి వెళ్ళండి

ఇక్కడ మైన్ పేజ్ లో అప్లికేషన్ లోకి వెళ్ళండి

ఇక్కడ మీకు Know Your Mobile APP మరియు IMEI  Verification అనే రెండు అప్షన్స్ వస్తాయి.

వీటిలో, IMEI  Verification అనే రెండు అప్షన్ ఎంచుకోండి

ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి

మీకు అందిన OTP ఎంటర్ చేసి ఎంటర్ చేయండి

ఇక్కడ మీరు IMEI కోసం సూచించిన బాక్స్ లో  ఇమెయిజ్ నంబర్ ఎంటర్ చేయండి

ఒకవేళ మీరు తీసుకోవాల్సిన ఫోన్ IMEI నంబర్ తెలియక పొతే *#06# తో తెలుసుకోవచ్చు

 చివరిగా, మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు స్టేట్స్ వివరాలు అందించబడతాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :