మీ స్మార్ట్ ఫోన్ లో ఇలా అవుతోందా..హ్యాక్ అయిందేమో చెక్ చేసు చేసుకోండి.!

Updated on 06-Jun-2023
HIGHLIGHTS

హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ లను హ్యాక్ చేసి డేటా ని సేకరించే పనిలో పడ్డారు

దీనికోసం రకరకాలైన ఎత్తుగడలు మరియు టెక్నాలజీ ని జోడిస్తున్నారు

మీ ఫోన్ ఎంత వరకూ సేఫ్ గా ఉందో మీరు తెలుసుకోవడం మంచిది

స్మార్ట్ ఫోన్ చేతిలో లేక పోతే పూటగడవని రోజులొచ్చాయంటే ఎంత మాత్రము ఆశ్చర్య పడవలసిన పనిలేదు. అంతగా స్మార్ట్ ఫోన్ కు అలవాడు పడిపోయారు అందరూ కూడా. 5G నెట్ వర్క్ వంటి ఆవిష్కరణలతో నిరంతరాయ మరియు వేగవంతమైన ఇంటర్నెట్ సౌలభ్యంతో ప్రజలు ఆన్లైన్ కె అంకితం అవుతున్నారు. అయితే, ఇదే అదునుగా హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ లను హ్యాక్ చేసి డేటా ని సేకరించే పనిలో పడ్డారు. దీనికోసం రకరకాలైన ఎత్తుగడలు మరియు టెక్నాలజీ ని జోడిస్తున్నారు. అందుకే, మీ ఫోన్ ఎంత వరకూ సేఫ్ గా ఉందో మీరు తెలుసుకోవడం మంచిది.   

స్మార్ట్ ఫోన్ లో కొన్ని లక్షణాలు కనిపిస్తే ఆ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసే వీలుంది. మరి ఈ ఫోన్ లో మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటో చూద్దామా. 

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా కనిపిస్తుందా? అయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లు అనునమానం వ్యక్తం చెయ్యవచ్చు. అంటే, మీ ఫోన్ లో బ్యాటరీ చాలా వేగంగా డ్రైన్ అవుతుంది. మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో చూడాలంటే మీరు బాగా పరిశీలించ వలసిన లేదా చెక్ చేయవలసిన విషయం ఏమిటంటే, మీరు మీ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించక పోయానా మీ డేటా వేగంగా ముగిసిపోవడం. అంటే, మీరు మీ ఫోన్ ను ఉపయోగించకుండా పక్కన పడేసినా మీ మొబైల్ డేటా పూర్తిగా ఖర్చు అయిపోవడం వంటి అసాధారణ విషయాన్ని మీరు చూడవచ్చు. 

మీరు మీ స్మార్ట్ ఫోన్ లో హ్యాంగ్ లేదా పెర్ఫాఫర్మెన్స్ లో లోపాన్ని చూడడం కూడా మరొక ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. అంటే, చాలా వేగంగా పనిచేసే మీ స్మార్ట్ ఫోన్  ఎటువంటి కారణం లేకుండా ఒక్కసారిగా పనిచెయ్యడం మేనేస్తుంది లేదా చాలా స్లో గా పని చేస్తుంది. 

మీ స్మార్ట్ ఫోన్ లో నడుసున్న యాప్స్ సడన్ గా ఎటువంటి కారణం లేకుండా మతి మాటికి క్లోజ్ అవుతున్నా మీ ఫోన్ హయక్ అయినట్లు మీరు అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఇక్కడ సూచించిన లక్షణాలను మీ స్మార్ట్ ఫోన్ కనబరుస్తున్నట్లయితే, మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినట్లు మీరు అనుమాన పడవచ్చు. 

వాస్తవానికి, చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ లలో ఇటివంటి సమస్య లు అప్పుడప్పుడు మీరు చూడవచ్చు. కానీ, కొత్తగా తీసుకున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో కూడా ఈ సమస్య లను చూస్తే మాత్రం ఈ ఫోన్ హ్యాక్ అయినట్లే అని ఊహించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :