మీ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సింపుల్.. ఎలాగో తెలుసుకోండి.!

మీ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సింపుల్.. ఎలాగో తెలుసుకోండి.!
HIGHLIGHTS

ప్రతి ఒక్క ఎంప్లాయ్ కి అత్యంత కీలకమైన పథకం EPF

EPF అకౌంట్ డిపాజిట్ వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసుకోవడం మంచిది

ఆన్లైన్ లో చాలా సింపుల్ గా EPF వివరాలు చెక్ చేసుకోవచ్చు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ప్రతి ఒక్క ఎంప్లాయ్ కి అత్యంత కీలకమైన పథకం. ఈ పథకం ద్వారా ప్రైవేటు ఉద్యోగులు వారి సంపాదనలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది వారి కంపెనీ. నెల నెలా జీతం నుండి ఈ అమౌంట్ ఎంప్లాయ్ ఫండ్, ఎంప్లాయర్ ఫండ్ మరియు పెన్షన్ ప్లాన్ ఫండ్ రూపంలో జమ అవుతుంది. అలాగే, ఎంప్లాయ్ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ లో ఎంత జమ అయ్యింది మరియు ప్రతి నెలా ఎంత అమౌంట్ జమ అవుతోందో తెలుసుకునే వీలు కూడా ప్రభుత్వం కల్పించింది. దీనికోసం, ఆన్లైన్, యాప్ మరియు మెసేజ్ సర్వీస్ లను కూడా అందించింది.

EPF బ్యాలెన్స్ ను ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి?

ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను ఆన్లైన్ లో చెక్ చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. ఈ పనిని మీ మొబైల్ బ్రౌజర్ నుండి కూడా ఈజీగా చేయవచ్చు. దీనికోసం, UAN నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ముందు నుండే మీ UAN తో సైన్ అప్ చేసి ఉంటే, passbook.epfindia.gov.in పేజ్ ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత UAN నెంబర్ మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసి క్రింద ఉండే క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ EPF అకౌంట్ వివరాలు అందించబడతాయి. ఇక్కడ  EPF అకౌంట్ పైన క్లిక్ చేస్తే, మీ ప్రావిడెంట్ ఫండ్ లో ఎంత అమౌంట్ ఉన్నదో పూర్తి వివరాలు వస్తాయి. ఒకవేళ UAN నెంబర్ పైన ఇప్పటివరకు లాగిన్ అవ్వకపోతే, unifiedportal ద్వారా సైన్ అప్ చేసుకోవాలి. 

EPF Balance Check
EPF Balance Check

EPF బ్యాలెన్స్ ను ఏ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు?

ఇది చాలా సింపుల్ గా మరియు వేగంగా ఉంటుంది. ప్రభుత్వ సర్వీస్ ల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన UMANG యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. దీనికోసం, గూగుల్ ప్లే స్టోర్ నుండి UMANG యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యాప్ అడుగుభాగాన my Umang పక్కనే ఉండే ‘Service’ ట్యాబ్ పైన నొక్కాలి. ఇక్కడ All Service లోకి వెళ్లి ఈపీఎఫ్ ను ఎంచుకోవాలి. వెంటనే మీరు ఈపీఎఫ్ సర్వీస్ పేజీకి చేరుకుంటారు. ఇక్కడ మీ UAN నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP సెండ్ కోసం రిక్వెస్ట్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ పై అందుకున్న OTP తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మెయిన్ పేజీలో కనిపించే ‘View Passbook’ ట్యాబ్ పై నొక్కాలి. ఇక్కడ మీ ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు మరియు బ్యాలెన్స్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Also Read: HTC U24 Pro: మూడు 50MP కెమెరాలు మరియు కొత్త డిజైన్ తో వచ్చింది.! 

EPF బ్యాలెన్స్ SMS ద్వారా ఎలా పొందాలి?

ఇది అన్నింటి కన్నా చాలా సింపుల్ మరియు స్పీడ్ సర్వీస్ గా చెప్పవచ్చు. మీ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మీ రిజిస్టర్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇలా చేస్తే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో అందుకుంటారు. లేదంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నెంబర్ కి పంపించాలి. ఇలా చేస్తే మీరు మీ మొబైల్ నెంబర్ పైన మీ బ్యాలెన్స్ వివరాలు SMS ద్వారా అందుకుంటారు. 

పెయిన్ తెలిపిన అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాలంటే, మీరు మీ UAN నెంబర్ ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసి ఉండాలి అని గుర్తుంచుకోండి.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo