Aadhaar Card: మీ ఆధార్ హిస్టరీ అప్పుడప్పుడు చెక్ చేసుకోండి..ఎందుకంటే.!
దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐడెంటిటీ ప్రూఫ్ గా Aadhaar Card నిలుస్తుంది
ఎటువంటి ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ ముఖ్యం
ఆధార్ హిస్టరీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా మంచిది
Aadhaar Card: దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐడెంటిటీ ప్రూఫ్ గా ఆధార్ కార్డు నిలుస్తుంది. ఎటువంటి ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, SIM కార్డ్ మొదలు కొని మరింకేదైనా ఐడెంటిటీ ఆధారిత పనులకు ఆధార్ ముఖ్యం. అందుకే, ఆధార్ కార్డ్ కి సంబంధించిన అన్ని వివరాలు సక్రమంగా అప్డేట్ చేసుకోవడంతో పాటు మీ ఆధార్ ఇప్పటి వరకు ఏ సర్వీస్ లకు ఉపయోగించబడిందని చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమైన విషయం అవుతుంది. అందుకే, మీ ఆధార్ హిస్టరీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా మంచిది.
Aadhaar Card హిస్టరీని ఎక్కడ చెక్ చేసుకోవాలి?
ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి ఆధార్ కార్డు హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. ఆధార్ హిస్టరీని చెక్ చేసుకోవడానికి ఎటువంటి రుసుమును చెల్లించవలసిన అవసరం లేదు మరియు ఇది పూర్తిగా ఉచితం. ఆధార్ కార్డు యూజర్లు my aadhaar వెబ్సైట్ లేదా mAadhaar App ద్వారా వారి హిస్టరీని రెగ్యులర్ గా చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ హిస్టరీ ని ఎలా చెక్ చేయాలి?
ఆధార్ హిస్టరీ ని ఆన్ లైన్ లో చెక్ చేయడం కోసం ముందుగా my aadhaar వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. తర్వాత, మీ ఆధార్ నెంబర్ మరియు క్రింద ఉన్న క్యాప్చా ని ఎంటర్ చేసి OTP కోసం రిక్వెస్ట్ పంపాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు అందుకున్న OTP తో లాగిన్ అవ్వాలి.
లాగిన్ అవ్వగానే మెయిన్ పేజీ తెరుచుకుంటుంది. ఈ పేజీలో ఆధార్ అప్డేట్ మొదలుకొని ఆధార్ అప్డేట్ హిస్టరీ వరకు చాలా ట్యాబ్స్ కనిపిస్తాయి. ఇందులో, ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ట్యాబ్ పైన నొక్కండి. నొక్కగానే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పేజీ ఓపెన్ అవుతుంది మరియు ఇందులో మీకు కావలసిన ఆప్షన్ మరియు డేట్ ని ఎంచుకొని GoTo Dashboard పైన నొక్కండి.
ఇప్పుడు మీకు మీ ఆధార్ కార్డు అథెంటికేషన్ PDF ఫైల్ అందించబడుతుంది. దీనికి 8 క్యారెక్టర్ కలిగిన పాస్వర్డ్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయడానికి మీ ఆధార్ కార్డులో ఉన్న మీ పేరు లోని మొదటి నాలుగు అక్షరాలు మరియు మీ పుట్టిన సంవత్సరం లను కలిపి ఎంటర్ చేయాలి. ఇందులో మీ ఆధార్ అథెంటికేషన్ కు సంబంధించిన అన్ని వివరాలు అందించబడతాయి.
మీరు అందుకున్న వివరాలలో ఏమైనా తప్పుగా అనిపిస్తే, మీ ఆధార్ తప్పుగా ఉపయోగించ బడిందని అర్థం. అందుకే, ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం మంచి విషయంగా ఉంటుంది.