ఒకరు వాడిన ఫోన్ కొంటున్నారా.. ఎలా చెక్ చెయ్యాలంటే..!!

Updated on 20-Jul-2022
HIGHLIGHTS

ఒకరు వాడిన స్మార్ట్ ఫోన్ కొనే ముందుగా చెక్ చెయ్యడం చాలా అవసరం

ఒకరు వాడిన ఫోన్ ను ఎటువంటి తనిఖీ నిర్వహించకుండా తీసుకుంటే మీకు ముప్పు తప్పదు

మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు

ఒకరు వాడిన స్మార్ట్ ఫోన్ కొనే ముందుగా చెక్ చెయ్యడం చాలా అవసరం. ఒకరు వాడిన ఫోన్ ను ఎటువంటి తనిఖీ నిర్వహించకుండా తీసుకుంటే మీకు ముప్పు తప్పదు. తక్కువ ధరకే వస్తుంది కదా! అని తొందర పడకండి, కొంచెం అలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే, మీరు ఎంచుకున్న ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు ముందుగా నిర్ధారించుకోవడం మంచిది.

మరి ఏమి చెయ్యాలి?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ నుండి మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు.

ఎలా చెక్ చెయ్యాలి ?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేక డూప్లికేట్ లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నదా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.

ఈ క్రింది విధంగా చెక్ చెయ్యొచ్చు

ముందుగా CEIR పోర్టల్ లోకి వెళ్ళండి

ఇక్కడ మైన్ పేజ్ లో అప్లికేషన్ లోకి వెళ్ళండి

ఇక్కడ మీకు Know Your Mobile APP మరియు IMEI  Verification అనే రెండు అప్షన్స్ వస్తాయి.

వీటిలో, IMEI  Verification అనే రెండు అప్షన్ ఎంచుకోండి

ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి

మీకు అందిన OTP ఎంటర్ చేసి ఎంటర్ చేయండి

ఇక్కడ మీరు IMEI కోసం సూచించిన బాక్స్ లో  ఇమెయిజ్ నంబర్ ఎంటర్ చేయండి

ఒకవేళ మీరు తీసుకోవాల్సిన ఫోన్ IMEI నంబర్ తెలియక పొతే *#06# తో తెలుసుకోవచ్చు

 చివరిగా, మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు వివరాలు అందించబడతాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :