Voter ID Card పాత ఫోటోని ప్లేస్ లో కొత్త ఫోటో అప్డేట్ చేసుకోవాలా? అయితే, వెంటనే ఈ పని చేస్తే సరిపుతుంది. ఓటర్ కార్డ్ వచ్చి చాలా కాలం గడిచిన తరువాత అప్పటి ఫోటో మరియు ఇప్పుడు ఉన్న తీరుకు ఎటువంటి పొంతనా ఉండకపోవచ్చు. అటువంటి ఇబ్బంది ఎదుర్కుంటున్న ఓటర్ కార్డ్ హోల్డర్లు, వారి కొత్త ఫోటోలతో కొత్త ఓటర్ కార్డ్ ను అందుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందించింది. ఇది చాలా కాలంగా అందుబాటులో ఉన్న ఉపయోగించుకోవడం తెలియని వారి కోసం మేము సహాయం చేయనున్నాము.
ఓటర్ ఐడి కార్డు లో ఎప్పుడిదో మీ పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో తో గుర్తు పట్టలేని విధంగా ఉన్న కార్డు లను కొత్త కలర్ ఫోటోతో సహా అప్డేట్ చేసుకునే వీలుంది. దీనికోసం పెద్దగా శ్రమించి కుండానే ఆన్లైన్ లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్ ద్వారా సహాయం చేస్తుంది.
ఓటర్ కార్డ్ లో కొత్త ఫోటోని అప్డేట్ లేదా చేంజ్ చెయ్యడానికి ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in ను ఓపెన్ చెయ్యాలి. ఈ వెబ్సైట్ లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన ద్వారా అవ్వాలి. ఒకేవేళ అకౌంట్ అకౌంట్ లేకుంటే మొబైల్ నెంబర్ మరియు పేరు వివరాలతో అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వవచ్చు.
లాగిన అయిన తరువాత సైట్ మెయిన్ పేజ్ లో కనిపించే Form 8 పైన క్లిక్ చెయ్యాలి. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది మరియు ఇక్కడ Application For Self మరియు Other elector అనే రెండు ఆప్షన్ లో కనిపిస్తాయి. ఇక్కడ మీరు కోరుకునే ఆప్షన్ ఎంటర్ చేసి Epic Number ను ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
Also Read: Vivo V30 Series: Zeiss ఆప్టిక్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వివో.!
ఇక్కడ స్టేట్, అసెంబ్లీ మరియు కాన్స్ట్యూయన్సీ లను ఎంటర్ చేసి ముందు వెళ్ళాలి. తరువాత సూచించిన వద్ద పూర్తి పేరు, EIPIC ID నెంబర్, మరియు సీరీయల్ నెంబర్ లను ఎంటర్ చెయ్యాలి. తరువాత ఇక్కడ మెనులో వున్నా ‘Photograph’ పైన క్లిక్ చేసి కొత్త ఫోటో ను జత చేయవచ్చు. అలాగే, అడ్రెస్స్, పేరు, పుట్టిన రోజు, తో అక్క సూచించిన అని వివరాలను పూర్తిగా నింపాలి.
ఇక్కడ అన్ని వివరాలను అందించిన తరువాత ఈ వివరాలను ఆధరైజ్ చేసే ఒక అధికారిక పత్రాన్ని మరియు కొత్త ఫోటోను యాడ్ చేసి సబ్మిట్ చెయ్యాలి. ఇలా చేసి సబ్మిట్ చేసిన తరువాత కన్ఫర్మేషన్ మెయిల్ పైన వస్తుంది మరియు 30 రోజుల్లో కొత్త కరెక్షన్ అప్డేట్ అవుతుంది.