మీ ఫోన్ లోనే మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవచ్చు.. ఇవి మాత్రమే..!!
మీ ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులుంటే మీరే సొంతంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు
అయితే, అన్ని వివరాలను అప్డేట్ చేసే అధికారం మీకు ఉండదు
మీ ఆధార్ కార్డ్ యొక్క ఇంటి అడ్రెస్స్ ను ఆన్లైన్లో మీరే అప్డేట్ చేసుకోవచ్చు
మీ ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులుంటే మీరే సొంతంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, అన్ని వివరాలను అప్డేట్ చేసే అధికారం మీకు ఉండదు. మీ అడ్రెస్స్ లో ఏవైనా తప్పులు ఉన్నా, లేదంటే మీరు కొత్త అడ్రెస్స్ ను అప్డేట్ చెయ్యాలనుకుంటే మాత్రమే మీకు ఈ అవకాశం ఉంటుంది. అంటే, మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ ఆధార్ కార్డ్ యొక్క ఇంటి అడ్రెస్స్ ను ఆన్లైన్లో మీరే అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఏదైనా ఐడెండిటీ ప్రూఫ్ ఒకటి కలిగి ఉంటే మాత్రం సరిపోతుంది.
మీ ఆధార్ కార్డ్ అడ్రెస్ అప్డేట్ లేదా సరిచేసుకోవాలంటే ఆన్లైన్ లో ఎలా చేయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరంగా ఈ క్రింద చూడవచ్చు.
ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:
ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి
ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది
దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు
ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి
మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది
మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది
ఇక్కడ Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి
ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి
తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు
OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి
అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.