ఆధార్ కార్డ్ లో ఈ వివరాలు మీరే అప్డేట్ చేసుకోవచ్చు..!!

Updated on 04-Aug-2022
HIGHLIGHTS

ఆధార్ కార్డ్ లో మీ అడ్రెస్స్ వివరాలను మీరు నేరుగా అప్డేట్ చేసుకోవచ్చు

ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది

ఆధార్ కార్డులో మీ అడ్రెస్ ను మీరే నేరుగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కార్డ్ లో మీ అడ్రెస్స్ వివరాలను మీరు నేరుగా అప్డేట్ చేసుకోవచ్చు. వాస్తవానికి, ఆధార్ కార్డ్ లో వివరాలను అప్డేట్ చెయ్యడానికి వీలుండదు. కానీ, అడ్రెస్స్ వివరాలను మాత్రం అప్డేట్ చేయడానికి UIDAI అవకాశం అందించింది . ఆధార్ కార్డ్ లో ఏదైనా వివరాలను అప్డేట్ చెయ్యాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆధార్ కార్డులో మీ అడ్రెస్ ను మీరే నేరుగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు మరియు దీనికోసం మీరు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.

ఆన్లైన్లో ఆధాaర్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:

ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి

ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది

దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు

ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి

మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది

మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది

ఇక్కడ  Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి

ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి

తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు

OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి

అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :