కొత్త SIM కార్డును తీసుకునేందుకు, ఆధార్ యొక్క e-KYC ని ఉపయోగించడం గురించి ప్రస్తుతం అనేక ఊహాగానాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆధార్ కొత్త SIM కార్డ్ కోసం కొత్త కార్యాచరణ తప్పనిసరి అని ఇప్పుడు ఎక్కువగా వినబడుతోంది. ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్ లేకుండా కొత్త సిమ్ కార్డు ఎలా పొందాలనే దానిపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.
DoT (టెలీకమ్యూనికేషన్ శాఖ) అధికారికంగా వినియోగదారు యొక్క డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్ట్ మరియు ఓటరు ఐడిని, ఒక క్రొత్త SIM కనెక్షన్ను నమోదు చేయడానికి చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చని అధికారికంగా ధృవీకరించింది. కాబట్టి, SIM కార్డు విక్రేతలు మీ చిరునామా ప్రమాణాలను స్కాన్ చేసి నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారు యొక్క ప్రత్యక్ష ఫోటోతో నమోదుచేస్తారు .
ఫాస్ట్ నెట్వర్క్ పనితనం. సిమ్ విక్రేతలు కూడా ఒక ఏకైక ID కలిగివుంటారు . ఈ KYC ప్రాసెస్ సమయంలో SIM ప్రమాణీకరణను ఆక్టివేట్ చేయడం కోసం ఇది పరిగణించబడుతుంది. వాస్తవానికి, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి టెలికం కంపెనీలు ఇప్పటికే న్యూఢిల్లీ, యుపి వంటి నగరాల్లో కొత్త డిజిటల్ KYC వ్యవస్థను ప్రారంభించాయి. మీ SIM కార్డును ఆధార్ ఇ-కెవైసి ప్రక్రియతో అప్డేట్ చేయడం ఇప్పుడు తప్పనిసరి కాదు.
ఈ ఆధార్ నంబరుకు జోడించని మొబైల్ నంబర్లకు ఎలాంటి అనివార్యచర్యలను చేయరాదని ఈ చట్టం పునరుద్ఘాటిస్తుంది. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ టెలికం కంపెనీలతో పంచుకోవాల్సిన అవసరంలేదు. అందువల్ల ఆధార్ కార్డు లేకుండా కొత్త సిమ్ కార్డు పొందడం ఎలాగో చాలా స్పష్టంగా తెలుస్తోంది. SIM విక్రేత ఎటువంటి ప్రభుత్వ అధికారిక ఐడిని కలిగిఉండపోతే, వినియోగదారుడు సదరు డిపార్టుమెంటుకు, ఈ విక్రేత గురించి ఫిర్యాదు చేయవచ్చు.