Gmail: ఇంటర్నెట్ లేకున్నా మెయిల్ పంపవచ్చు..ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా.!

Updated on 01-Nov-2022
HIGHLIGHTS

అత్యంత ప్రజాదరణ పొందిన మెయిలింగ్ సేవల్లో ఒకటైన Gmai

Gmail లో గూగుల్ కొత్త సర్వీస్ ను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది

కొత్త ఫీచర్ తో ఆఫ్‌లైన్ మోడ్‌లో ఇమెయిల్ ను పంపే ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన మెయిలింగ్ సేవల్లో ఒకటైన Gmail ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.8 బిలియన్ వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే, ఇంత మంది వినియోగదారులు వారి మెయిలింగ్ అవసరాలకు జిమెయిల్ పైన ఆధార పడుతున్నారని మనం అర్ధం చేసుకోవచ్చు. అటువంటి Gmail లో గూగుల్ కొత్త సర్వీస్ ను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

జీమెయిల్ లో గూగుల్ యాడ్ చెయ్యనున్న కొత్త ఫీచర్ తో ఆఫ్‌లైన్ మోడ్‌లో ఇమెయిల్ ను పంపే ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ లేకుండా ఇంటర్నెట్ లేకున్నా మెయిల్ పంపవచ్చు. మీ డివైజ్ ఏదైనా సరే Wifi నెట్‌వర్క్‌లో లేదా లోకల్ డేటాను లేకున్నాసేల్  ఈ ఫీచర్ ఉపయోగించి మీరు ఇమెయిల్‌ లను చదవవచ్చు, రిప్లై ఇవ్వవచ్చు మరియు సెర్చ్ కూడా చెయ్యవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేదా తక్కువ కనెక్టివిటీ అవకాశం ఉన్న ప్రదేశాలలో ఈ సరికొత్త వినూత్న ఫీచర్ సజావుగా పని చేస్తుంది.

Gmail యొక్క ఆఫ్‌లైన్ సర్వీస్ Google Chrome బ్రౌజర్‌లో మాత్రమే పని చేస్తుందని, incognito మోడ్‌లో పనిచేయదని Google సపోర్ట్ పేజీ పేర్కొంది. ఇక మీ డివైజ్ లో Gmail యొక్క ఆఫ్‌లైన్ సర్వీస్ ను ఏవిధంగా సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా క్రింద చూడవచ్చు.

మీ డివైజ్ లో Gmail ఆఫ్‌లైన్ మోడ్‌ ఎలా సెట్ చేసుకోవాలి

ముందుగా, Google Chromeను తెరిచి, ఎగువ కుడి మూలలో ఉన్న సెట్టింగ్స్ కాగ్ ఐకాన్ ను ఉపయోగించి మీ Gmail ఖాతాను యాక్సెస్ చేయండి. తరువాత, సెట్టింగ్‌ల మెనుని తెరవడానికి 'See All Settings' పై క్లిక్ చేసి అందులో 'ఆఫ్‌లైన్' ట్యాబ్‌కు వెళ్లండి. ఇక్కడ Gmail ఆఫ్‌లైన్ మోడ్‌ను ఆన్ చేయడానికి'Enable offline mail' అని తెలిపే బాక్స్ ను ఎంచుకోండి. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత, దిగువన ఉన్న  'Save Changes button' బటన్‌ను క్లిక్ చేయండి. అంతే, మీ డివైజ్ లో Gmail యొక్క ఆఫ్‌లైన్ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :