LPG Gas Cylinder: ఉచిత గ్యాస్ కనెక్షన్స్ కోసం ఎలా అప్లై చెయ్యాలో తెలుసా.!
దేశప్రజలకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (PM Modi) గారు వరాల జల్లును కురిపించారు
ujjawala scheme 2.0 లో భాగంగా 75 లక్షల కొత్త ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రకటన
ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు
Rakhi 2023 పండుగ సందర్భంగా దేశప్రజలకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (PM Modi) గారు వరాల జల్లును కురిపించారు. ప్రతి ఇంటికి అవసరమైన LPG Gas Cylinder పైన రూ. 200 రూపాయల తగ్గింపును అందించడమే కాకుండా ujjawala scheme 2.0 లో భాగంగా 75 లక్షల కొత్త ఉచిత గ్యాస్ కనెక్షన్ లను కూడా అందించనున్నట్లు ప్రకటించారు. LPG Gas Cylinder పైన తగ్గింపును ప్రకటించిన వేంటనే అమలు చెయ్యడం కూడా జరిగింది మరియు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు. ఉచిత గ్యాస్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు వివరంగా తెలుసుకోండి.
ఉచిత LPG Gas Cylinder కోసం ఎలా అప్లై చెయ్యాలి?
ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో అప్లై చెయ్యడానికి మీరు ముందుగా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అధికారిక గర్నమెంట్ వెబ్సైట్ pmuy.gov.in ని ఆశ్రయించాలి. ఇది మీ మొబైల్ ద్వారా కూడా చేసే వీలుందని గుర్తుంచుకోండి.
ముందుగా pmuy.gov.in/ujjwala2 అని టైప్ చేసి పేజ్ ను ఓపెన్ చెయ్యాలి. ఇక్కడ ujjawala 2.0 Connection కోసం అప్లై చెయ్యడానికి Click Here అని ఉన్న అప్షన్ పైన నొక్కండి. ఇక్కడ మీకు మూడు ప్రధాన గ్యాస్ సరఫరా ధారలు కనిపిస్తారు. అదేనండి HP Gas, Indane gas మరియు BharatGas ప్రొవైడర్స్ లో మీకు నచ్చిన దానిని ఎంచుకోండి.
గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకోగానే మీరు ఆ గ్యాస్ ప్రొవైడర్ యొక్క అఫీషియల్ వెబ్సైటు కు మల్లించ బడతారు. ఇక్కడ కొత్త పేజ్ లో Regester For LPG కనెక్షన్ పేజ్ లో Ujjawal Beneficiary Connection ను ఎంచుకోవాలి. ఇక్కడ క్రింద బాక్సులో అన్ని కండీషన్స్ చదివి అర్ధం చేసుకున్న తరువాత ఇక్కడ క్రింద కనిపించే బాక్స్ లో టిక్ పెట్టి క్రింద సూచించిన వద్ద మీ ఏరియా డిస్టిబ్యూటర్ పేరు, అడ్రెస్స్, ఆధార్ మరియు తెలిపిన అన్ని వివరాలను అందించి మీ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ వివరాలతో పాటుగా మీ లేటెస్ట్ పాస్ పోర్ట్ Photo ను కూడా మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని సూచించిన వద్ద అప్ లోడ్ చెయ్యాలి.
ఇక్కడ వివరాలను అందించిన తరువాత మీ ఉచిత కొత్త కనెక్షన్ అప్లికేషన్ ఆన్లైన్ లో అందించ బడుతుంది.
ujjawala scheme 2.0 లో ఎవరు అప్లై చేసుకోవచ్చు?
ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ తీసుకోని SC, ST, Most Backward Classes (MBC), Tea మరియు Ex- Tea Garden tribes లేదా 14 పాయింట్ డిక్లరేషన్ ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువున్న వుంది 18 సంవత్సరాలు నిండిన ఆడవారు ఎవరైనా ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై చేయడానికి అర్హులే.
ఉచిత LPG Gas Cylinder కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి?
ఉచిత LPG Gas Cylinder కోసం అప్లై చేయడానికి ID Proof గా ఆధార్ కార్డ్, ఫ్యామిలీ గుర్తింపు మరియు అడ్రెస్ కోసం Ration Card, బ్యాంక్ అకౌంట్ నంబర్ ను IFSC కోడ్ తో పాటుగా అందించాలి మరియు KYC ని కూడా దీనికి జత చేయాలి.