ఉచిత Gas Connection కోసం అప్లై చెయ్యాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
ప్రతి ఇంటికి Gas Connection అనేది ముఖ్యమైన అవసరంగా మారిపోయింది
75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్ లను ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు
మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి ఇంటికి LPG Gas Connection అనేది ముఖ్యమైన అవసరంగా మారిపోయింది. కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొల్యూషన్ ను తగ్గించడానికి మరియు వంట చెరకు కోసం చెట్లును నష్టపోకుండా కూడా ఇది సహాయం చేస్తుంది. తద్వారా, పర్యావరణ రక్షణను చెయ్యడానికి కూడా అనుకూలిస్తుంది. అందుకే, ప్రభుత్వం కూడా గ్యాస్ కనెక్షన్ లను ప్రోత్సహిస్తోంది. ujjawala scheme 2.0 నుండి 75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్ లను ఉచితంగా అందించనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
2024 రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కొత్త కనెక్షన్ ప్రకటన చేశారు. అంతేకాదు, అదే రోజు గ్యాస్ సిలెండర్ పైన రూ. 200 రూపాయల తగ్గింపును కూడా ప్రకటించారు. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చాలా శీఘ్రంగా అవకాశం కూడా అందించారు. మరి ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామా.
ఉచిత Gas Connection కోసం ఎలా అప్లై చెయ్యాలి?
మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, అధికారిక వెబ్సైట్ pmuy.gov.in ద్వారా అప్లై చెయ్యాలి. ఇది మీ మొబైల్ ద్వారా కూడా చేసే వీలుందని కూడా గుర్తుంచుకోండి.
దీనికోసం, ముందుగా pmuy.gov.in/ujjwala2 అని టైప్ చేసి పేజ్ ను ఓపెన్ చెయ్యాలి. ujjawala 2.0 Connection కోసం అప్లై చెయ్యడానికి Click Here అనే ఆప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు ప్రధాన గ్యాస్ సరఫరాధారులు కనిపిస్తారు. అంటే, HP Gas, Indane gas మరియు BharatGas ప్రొవైడర్స్ ఆప్షన్ లి మీకు కనిపిస్తాయి మరియు ఇక్కడ మీకు నచ్చిన దానిని ఎంచుకోండి. మీరు ఇక్కడ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకోగానే మీరు ఆ గ్యాస్ ప్రొవైడర్ యొక్క అఫీషియల్ వెబ్సైటు కు చేరుకుంటారు.
Also Read: Gold Price Today: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న గోల్డ్ మార్కెట్.!
ఇక్కడ వచ్చిన కొత్త పేజ్ లో Regester For LPG కనెక్షన్ పేజ్ లో Ujjawal Beneficiary Connection ను ఎంచుకోవాలి. ఇక్కడ సూచించిన బాక్సులో ఇచ్చిన అన్ని కండీషన్స్ చదివి అర్ధం చేసుకున్న పిదప దాని క్రింద కనిపించే బాక్స్ లో టిక్ పెట్టి ముందుకు సాగండి. ఇక్కడ క్రింద సూచించిన వద్ద మీ ప్రాంత డిస్టిబ్యూటర్ పేరు, అడ్రెస్స్, ఆధార్ మరియు అడిగిన అన్ని వివరాలను అందించండి. అంతేకాదు, మీ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ వివరాలతో పాటుగా మీ లేటెస్ట్ పాస్ పోర్ట్ Photo ను కూడా మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని సూచించిన వద్ద అప్ లోడ్ చేయండి.
ఇక్కడ వివరాలను అందించిన తరువాత మీ ఉచిత కొత్త కనెక్షన్ అప్లికేషన్ ఆన్లైన్ లో అందించ బడుతుంది. అయితే, ఈ ఉచిత కనెక్షన్ కోసం అందరూ అప్లై చేయడం కుదరదు. దీనికి కోసం అపీలు చెయ్యాలంటే, ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ తీసుకోని SC, ST, Most Backward Classes (MBC), Tea మరియు Ex- Tea Garden tribes లేదా 14 పాయింట్ డిక్లరేషన్ ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువున్న ఉన్నవారే అర్హులు. అంతేకాదు, 18 సంవత్సరాలు నిండిన ఆడవారు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై చేయడానికి అర్హులు.