ఇంట్లోనే మొబైల్ నంబరును ఆధార్ తో లింక్ చేయండి.

Updated on 07-Feb-2018

ఇప్పటి వరకు మొబైల్ నంబర్ ని ఆధార్ కి  లింక్ చేయడానికి, మీరు మీ సమీప దుకాణానికి వెళ్లి  గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు UIDAI ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పుడు మీరు క్రింద ఇచ్చిన సూచనలను అనుసరించడం ద్వారా సులభంగా మీ నంబర్ను లింక్ చేయవచ్చు. 

స్టెప్ 1: మీ మొబైల్ నుండి 14546 కి డయల్ చేసి  IVR కోసం వేచి ఉండండి.
స్టెప్ 2: కాల్ కనెక్ట్ అయిన  తర్వాత, ఇచ్చిన సూచనలకు జాగ్రత్తగా వినండి మరియు వాటిని అనుసరించండి. మీరు ఇండియన్ అయితే, ప్రెస్ 1 లేకపోతే విదేశీయుడితే 2 నొక్కండి. 
స్టెప్  3: ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి. ధృవీకరణ కోసం, ఇది తిరిగి నమోదు చేయాలి.
స్టెప్ 4: నిర్ధారణకు ప్రెస్ 1 ,మీరు తప్పు చేసినట్లయితే  2 నొక్కండి.
స్టెప్  5: ఇప్పుడు మీ నెంబర్ పై  6 అంకెల OTP  వస్తుంది. ఈ సమయంలో, టెలికాం ఆపరేటర్ మీ పేరు, ఫోటో మరియు పుట్టిన తేదీని వాయిస్ మెసేజ్  పంచుకోవడానికి అనుమతిని కోరుతుంది.
స్టెప్ 6: ఇప్పుడు మెసేజ్ లో  అందుకున్న 6 అంకెల OTP ను ఎంటర్ చెయ్యండి.
స్టెప్  7: మీ మొబైల్ నంబర్ తదుపరి 48 గంటల్లో లింక్ చేయబడుతుంది. 

 

Connect On :