ఈ సింపుల్ 3 ట్రిక్స్ తో, మీ ఫోన్ లో ఇంటర్నెట్ నడుస్తుంది డబుల్ స్పీడ్ తో….

Updated on 30-Mar-2018

నేటి ఆధునిక శకంలో, ఇంటర్నెట్ ఒక మనిషి యొక్క అవసరంగా  మారింది. ఈ యుగంలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, పట్టణాల నుండి గ్రామ ప్రజలందరికీ ఇంటర్నెట్ అవసరం ఉంది.భారతదేశంలో చాలామంది తమ  ఫోన్లలో ఇంటర్నెట్ వాడుతున్నారు . 

ఇటువంటి పరిస్థితిలో, మన ఫోన్స్ లో ఎటువంటి  అంతరాయం లేకుండా ఇంటర్నెట్ ని  కొనసాగించాలని అనుకుంటాము . కొన్నిసార్లు ఇంటర్నెట్ నడవటం లో సమస్యలు ఎదురు అవుతాయి మరియు ఇంటర్నెట్  స్పీడ్  తగ్గించడానికి ఎవరూ ఇష్టపడరు.

మీరు ఈ మూడు విధాలుగా మీ స్మార్ట్ఫోన్ లో  ఇంటర్నెట్ బ్రౌజర్ యొక్క వేగాన్ని పెంచవచ్చు:

పెర్ఫార్మన్స్ బూస్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి –

మొదట , మీ ఫోన్ లో "క్లీన్ మాస్టర్" డౌన్లోడ్ చేయండి , అన్ని జంక్ ఫైళ్ళను క్లియర్ చేసి  ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచవచ్చు . ఇదే కాక  మీ స్మార్ట్ఫోన్లో "DU స్పీడ్ బూస్టర్" ఇన్స్టాల్ చేయండి . ఇది మీ ఫోన్ యొక్క RAM ను క్లియర్ చేస్తుంది మరియు కొన్ని అనవసరమైన యాప్స్  రన్ అవ్వకుండా  నిలిపివేస్తుంది. ఇది మీ Android స్మార్ట్ఫోన్ మరియు ఇంటర్నెట్ స్పీడ్ రెండిటిని  వేగవంతం చేస్తుంది.

నెట్వర్క్  సెట్టింగ్స్ ని చెక్  చేయండి-

మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్లో గా  ఉంటే, మీరు మీ ఫోన్ యొక్క ఇంటర్నెట్ సెట్టింగులను చెక్  చేయాలి. మీ ఫోన్ యొక్క సెట్టింగ్స్ కి  వెళ్లి మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్లను ఎంచుకోండి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏ మోడ్ లో ఉందొ  చెక్ చేసిన తర్వాత అది 3G మోడ్లో ఉంటే, LTE, WDCMA, GSM (AUTO MODE) లో దాన్ని ఎంచుకోండి. మీ ఫోన్ 3G మోడ్లో  ఉండకుండా  చూడండి. ఆ తరువాత సెట్టింగ్ నుండి బయటకు వెళ్లి, మీ ఫోన్ ని  స్విచ్ ఆఫ్ చేసి ఆపై దాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ నడవటం  ప్రారంభమవుతుంది. మేము ఈ ప్రాసెస్ ని  మూడు సులభ దశల ద్వారా ప్రాసెస్ చేసాము . 

సెట్టింగ్ -> మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్-> LTE, WDCMA, GSM (ఆటో  మోడ్) -> నిష్క్రమణ సెట్టింగులు -> ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయండి  -> మళ్ళీ ఫోన్ ని స్విచ్ ఆన్ చేయండి . 

ఫాస్ట్ వెబ్  బ్రౌజర్ యూజ్ చేయండి – 

స్మార్ట్ ఫోన్ లో స్పీడ్ ఇంటర్నెట్ నడిపే వేగవంతమైన వెబ్ బ్రౌజర్ ని ఇన్స్టాల్  చేయాలి . మీరు వేగవంతమైన బ్రౌజర్ తో  ఇంటర్నెట్ ని  అమలు చేస్తే, దాని స్పీడ్ బాగుండును మరియు ఎటువంటి ఆటంకాలు వుండవు . ఈ రోజుల్లో అధిక వేగంతో ప్రపంచవ్యాప్తంగా పనిచేసే మూడు వెబ్ బ్రౌజర్లు ఉన్నాయి.

1. ఓపెరా మినీ  (OPERA MINI) 
2. యూసీ బ్రౌజర్  (UC BROWSRE) 
3. గూగుల్ క్రోమ్  (GOOGLE CHROME)

ఈ మూడు ఇంటర్నెట్ బ్రౌజర్లలో ఏది  ఇన్స్టాల్ చేసినా  సరే  మీ ఇంటర్నెట్ వేగంగా  నడుస్తుంది . ఈ  3 పద్ధతుల తో  మీ ఇంటర్నెట్ 5G స్పీడ్ తో నడవదు . కాని ఇప్పటికే ఉన్న ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది

 

 

 

 

 

Connect On :