మీ ఇంటిని ఫర్నిషింగ్ చేసే ముందే అది ఎలా ఉందో చూసే కొత్త టెక్నాలజీ
Virtual Reality తో ఇది సాధ్యం అవుతుంది
HomeLane.com సంస్థ సరికొత్త వర్చ్యువల్ రియాలిటీ టూల్ ను లాంచ్ చేస్తుంది. దీని పేరు Kaleido. ఇది మీరూ కొనడానికి ప్లేన్ చేసుకున్న ఫర్నిచర్ మరియు ఇతర ఫర్నిషింగ్ ఐటమ్స్ ఇంటిలోపల ఎలా కనిపించనున్నాయో అంచనా వేసి చూపిస్తుంది.
Homelane.com తాజాగా చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయం వెల్లడించారు. టోటల్ హోం ఫర్నిషింగ్ ఇండస్ట్రీ ఫంక్షన్స్ ను ఇది మర్చివేయనుంది అని అన్నారు. బయర్స్ కు వాళ్లు ఇంటిలోనికి కొనబోయే కొత్త వస్తువులతో ఇల్లు ఎలా ఉండనుంది అనేడి వర్చ్యువల్ గా డిస్ప్లే చేయటమే దీని కాన్సెప్ట్. ముందే మీరు కొనబోయే వస్తువుల ఏ కలర్స్ అయితే ఇంట్లో బాగా కనపడుతున్నాయి అని చెక్ చేయటానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.
Kaleido గూగల్ కార్డ్ బోర్డ్ వర్చ్యువల్ రియాలిటీ టెక్నాలజీ తో పనిచేస్తుంది. అసలు విషయం ఏంటంటే సంస్థ వర్చ్యువల్ డిస్ప్లే ను చూపించటానికి దానికి అవసరం అయ్యే VR అరేంజ్ మెంట్స్ కోసం ఎటువంటి ఎక్స్ట్రా డబ్బులను తీసుకోదు. ఒక సారి బయ్యర్ వాళ్లకి కావలిసిన ఐటెం ను చూస్ చేసుకుంటే, అది Virtual రియాలిటీ లో చూడటానికి homelane.com కు 6 వారలు పడుతుంది ప్రోడక్ట్ ఇన్స్టాలేషన్ అరేంజ్ మెంట్స్ చేయటానికి. అన్ని ప్రోడక్ట్ల పై 5 సంవత్సరాల వారంటీ ఇస్తుంది,
బెంగుళూరు లోని మొదటి కస్టమర్, రష్మి ఈ టెక్నాలజీ ని వాడి ఫర్నిషింగ్ షాపింగ్ చేసారు. ఇది ఒక మంచి డెసిషన్ మేకింగ్ సల్యుషణ్ అని చెప్పారు.