Hero Moto: ఎక్కువ దూరం మరియు వేగంతో ప్రయాణించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చింది..!

Updated on 10-Oct-2022
HIGHLIGHTS

ఎక్కువ దూరం మరియు వేగంతో ప్రయాణించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida V1 తెచ్చింది

హీరో మోటో Vida V1 నుండి రెండు మోడళ్లను తీసుకొచ్చింది

Hero Vida V1 రెండు వేరియంట్ లలో అందించబడుతుంది

Hero Moto: ఎక్కువ దూరం మరియు వేగంతో ప్రయాణించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చింది. అదే, Hero Vida V1 మరియు ఈ స్కూటర్ అధిక వేగం మరియు అధిక వేగం ప్రయాణించగల శక్తిని కలిగివున్నట్లు హీరో పేర్కొంది. అంతేకాదు, హీరో మోటో Vida V1 నుండి రెండు మోడళ్లను తీసుకొచ్చింది. అవి Vida V1 Pro మరియు Vida V1 Plus వున్నాయి. మరి మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలాంటి ఫీచర్లతో ఉన్నాయో చూద్దామా.   

Hero Vida V1: ప్రత్యేకతలు

పైన తెలిపిన విదంగా, Hero Vida V1 రెండు వేరియంట్ లలో అందించబడుతుంది. అవి, విడా వి1 ప్రో మరియు విడా వి1 ప్లస్ వున్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా గరిష్టంగా 80 Kmph టాప్ స్పీడ్ తో ప్రయానించే శక్తితో వస్తాయి. అంతేకాదు, ఈ రెండు వేరియంట్ లు కూడా మార్చుకోగల (swappable)  బ్యాటరీలతో కూడా వస్తాయి. ఇక ప్రయాణ సామర్ధ్యం విషయానికి వస్తే, Vida V1 Pro పూర్తి ఛార్జింగ్ తో 165 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలిగితే, Vida V1 Plus  మాత్రం పూర్తి ఛార్జింగ్ తో 143 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

ఈ రెండు స్కూటర్లలో కూడా 7 ఇంచ్ HD టచ్ డిస్ప్లేతో పాటుగా రెజ్యూమ్ ఫంక్షన్‌తో క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో V1 Pro కేవలం 2 గంటల 17 నిమిషాల లోపు 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని మరియు V1 Plus 2 గంటలలోపు 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని హీరో పేర్కొంది.

Hero Vida V1: ధర

విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ రూ.1,45,000 నుండి ప్రారంభమవుతుంది. అయితే, హై ఎండ్ వేరియంట్ Vida V1 Pro ధర మాత్రం రూ.1,59,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ Vida ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతాయి. అయితే, డెలివరీ మాత్రం డిసెంబర్ 2022లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :