జనవరి 1వ తేదీ నుండి TV ఛానళ్ల ధరలు ఇలా ఉంటాయి

జనవరి 1వ తేదీ నుండి TV ఛానళ్ల ధరలు ఇలా ఉంటాయి
HIGHLIGHTS

జనవరి 1వ తేదీ నుండి TRAI ప్రకారం ధరల వివరాలు

టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), చందాదారుల కోసం పే చానెల్స్ కోసం గరిష్ట రిటైల్ ధరల జాబితాను వెల్లడించింది. కొత్త టారిఫుల ద్వారా    చందాదారులు తమకు నచ్చిన ఛానళ్లకు మాత్రమే డబ్బు చెల్లించాలని కోరుకుంటున్నారు, మరియు వారు ఛానెల్ యొక్క ప్రసారకర్తలు (బ్రాడ్కాస్టర్స్)  నిర్ణయించిన MRP ను చూడాలనుకుంటున్నారు. Star, viacom  మరియు Zee వంటి ప్రధాన ప్రసార సంస్థలు వాటి యొక్క గ్రూప్ ఛానల్ ధరలను ప్రకటించాయి, వీటిలో ప్రతి ప్రత్యేకమైన వేర్వేరు ఛానెళ్లు నిర్దిష్ట ధరలతో ఉన్నాయి.

కొత్త ధర నిర్ణయించడం వలన వినియోగదారులకు వారు చూడని ఛానళ్ళకు డబ్బును చెల్లించే అవసరముండదు కాబ్బటి ఆ డబ్బుని ఆదా చేయడానికి ఒక చక్కని మార్గం. సాధారణంగా, DTH ప్రొవైడర్లు ఒక నిర్దిష్ట ధర కోసం సమీకరించిన ఒక గ్రూపు ఛానళ్లను కలిగి ఉన్న ప్లాన్స్ ని అందిస్తారు.

కొత్త ధర జాబితాలో, HD చానెల్స్ SDఛానళ్ల కంటే అధికమైన ధరతో ఉంటాయి. స్టార్ ప్లస్ కోసం రూ. 19 రూపాయల ధర నుంచి, ABP ఆనందకు రూ.50 పైసా   వరకు ఉంటుంది.  పొరుగు ప్రాంతాలలో ఎన్నో వినోద ఛానళ్ళు  రూ .8 నుంచి రూ .15 వరకు అధిక ధరలో ఉంటాయి. అయితే, న్యూస్ ఛానళ్లు మాత్రం తక్కువ ధరతో ఉంటాయి.  

నూతన ధరల సమయంలో, వినియోగదారులకు కనీసం 100 ఛానెళ్లను ఎంచుకోవలసి ఉంది, వీటిలో తప్పనిసరిగా 26 దూరదర్శన్ ఛానళ్ళను ఎంచుకోవాల్సివుంటుంది. అటువంటి ప్యాకేజీకి దాదాపు మొత్తం 130 రూపాయలు 18 శాతం జిఎస్టిని ఖర్చు చేయాలి. ఇతర ప్రభుత్వ ఛానళ్ళు ఫ్రీ -టూ-ఎయిర్   (FTA)గా ఉంటాయి మరియు వినియోగదారులు వీటికోసం రు .20 లు చెల్లించాలి. 26 దూరదర్శన్ చానెళ్లకు మినహాయిస్తే, చందాదారులు వారు చూడాలనుకునే ఏ ఛానల్ని అయినా ఎంచుకోవచ్చు.

TRAI ద్వారా ఈ కొత్త టారిఫ్ పాలసీ ప్రసారకర్తల ఛానెళ్లకు నెలకు ధరను డ్రాఫ్ట్ చేయాలి. ఈ ఆర్డర్, ఒక నిర్దిష్ట ధర కోసం అధికమైన ఛానళ్లకు కూడా అనుమతిస్తుంది. అయితే, నిర్ధేశించిన గ్రూప్ ఛానెళ్ల యొక్క ధర, మరియు  గ్రూప్ ఛానెళ్ల యొక్క మొత్తం ఈ ఛానళ్ల యొక్క ధర నుండి 85% కంటే క్రింద ఉండకూడదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo