కేరళ వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి దానికి సంభందించిన పూర్తి వివరాలు

కేరళ వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి దానికి సంభందించిన పూర్తి వివరాలు
HIGHLIGHTS

ఈ శతాబ్ది కాలంలో వచ్చిన మహోగ్ర వరద కారణంగా అల్లాడిపోతున్నకేరళ , ఇప్పుడు మీ సహాయం కోసం ఎదురు చూస్తుంది. కేరళ ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికోసం పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందించాము, ఇప్పటికే 168 మందికి పైగా ప్రాణనష్టం జరిగినట్లు అంచనా.

రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో కేరళ వరద పరిస్థితి మరింత దిగజారుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ ప్రకారం, ఆగస్టు 8 నుంచి వచ్చిన వరదలకు 168 మందికి పైగా ప్రాణ నష్టం, జరిగిందని తెలిపారు.రెడ్ అలెర్ట్ గా ప్రకటించిన 14 జిల్లాల్లో ముఖ్యంగా  పాతానంతిట్ట, ఎర్నాకుళం, అలప్పుజ్, త్రిసూర్ -ఈ నాలుగు జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. అనేక నదులలో నీటి స్థాయిలుప్రమాధ స్థాయిలో పెరిగి  అనేక పట్టణాలు మరియు గ్రామాలన్నీ ముంచెత్తాయి.

అక్కడ పరిస్థితి కచ్చితంగా భయంకరంగా ఉంది మరియు వరదలు వచ్చిన  ప్రదేశాలలో వైద్య సంరక్షణతోపాటు, రెస్క్యూ మరియు ఉపశమన పదార్థాలను అందించడమే కాకుండా  అక్కడ ప్రజలను మరియు కుటుంబాలను వేరొక సురక్షిత ప్రాంతానికి  మార్చడానికి  ముఖ్యంగా అవసరం ఉంది. విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాలంటీర్లు మరియు ఎన్జిఓలు కృషి చేస్తున్నాయి, కానీ వారికి మీ సహాయం కావాలి. వరద సంఘటనలను ట్రాక్ చేయడానికి ఇప్పుడు గూగుల్ సెర్చ్ ప్రత్యేక ట్యాబ్ను కల్పించారు. వెల్లువెత్తినవారికి సంప్రదించడానికి అత్యవసర మరియు హెల్ప్లైన్ నంబర్ల జాబితాను గూగుల్ అందించింది. కేరళలో పౌరులను గుర్తించడంలో సహాయం చేయడానికి గూగుల్ యొక్క పీపుల్ ట్రాకర్ కూడా వీలుగా ఉంది. సైన్యం యొక్క 16 బృందాలు, 42 నావికా దళాలు మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్ యొక్క 28 జట్లు ప్రస్తుతం రక్షణ మరియు సహాయ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాయి.

కానీ అక్కడ అందాల్సిన సహాయక  చేర్యల అవసరం  చాలా ఉంది. ఆస్పత్రులలో  ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నారుమరియు ఇంధనం యొక్క విస్తృత కొరత ఉంది.

కన్నూర్ యొక్క కలెక్టర్ ప్రజలకు ఆర్థిక సహాయమే కాకుండా ఈ విధమైన అంశాలను కూడా సహాయం చేయవచ్చని కోరింది:

1. వంట పాత్రలు మరియు ప్లేట్లు ,గ్లాసులు వంటి భోజన సామాగ్రి.

2. సామాన్య ఇంటి సామాగ్రి (కుర్చీలు,బల్లలు లాంటివి).

3.ఇంట్లో బియ్యం మరియు ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాడే కంటైనర్లు 

4. పాదరక్షకలు (ఫుట్ వేర్).

5. బకెట్లు ,ముగ్గులు. 

మీరు వాటిని ఇక్కడికి పంపవచ్చు:

కంట్రోల్ రూమ్, కలెక్టర్, కన్నూర్ – 670002,

ఫోన్ నంబర్. 9446682300, 04972700645

అంతేకాకుండా, ఈ క్రింద తెలిపిన వాటిని కూడా మీరు పంపించవచ్చని  ఇడుక్కి కలెక్టర్ కోరారు.

మీరు వాటిని ఇక్కడికి పంపవచ్చు:

జిల్లా కలెక్టర్ ఇడుక్కి, ఇడుక్కి కలెక్టర్, పినావు పి ఓ, కుయులిమల, ఇడుకీ, పిన్ – 685603.

ఐటి మిషన్ యొక్క మద్దతుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ యొక్క కేరళ అధ్యాయ ప్రభుత్వ విభాగాలు, వాలంటీర్లు మరియు ప్రజలతో సమర్థవంతంగా పనిచేయడానికి ఒక వెబ్సైట్నుకూడా ప్రారంభించింది. ప్రజల నుండి అభ్యర్థించిన మేరకు పదార్థాలను బట్వాడా చేయడానికి ప్రతి జిల్లాలలోని కాంటాక్ట్  పాయింట్ల ద్వారా ఈ వెబ్సైట్ పర్యవేక్షిస్తుంది.

 keralarescue.in అని పిలువబడే ఈ వెబ్ సైట్ ద్వారా వరద ప్రభావితమైన వ్యక్తులు వారి స్థానాలను మరియు వారి నిర్దిష్ట అవసరాల వివరాలు అందిస్తుంది. జిల్లా నిర్దిష్ట అవసరాలు కలెక్షన్ పాయింట్లు మరియు కాంటాక్ట్ స్థానంతో పాటు చూడవచ్చు. మీరు రెస్క్యూ కార్యకలాపాలకు సహాయంన్నీ స్వచ్ఛందంగా అందించవచ్చు.

కేరళ ముఖ్యమంత్రి, పినారాయ్ విజయన్ తన విపత్తు ఉపశమన నిధిని తెరిచారు, ఇక్కడ మీరు మీ వంతు సాయాన్ని పంపవచ్చు. మీ చెక్కు / డిడితో మీరు ఒక మెయిల్ పంపవచ్చు: 

ది ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) ట్రెజరర్ ,

చీఫ్ మినిస్టర్ యొక్క డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్,

సెక్రెటేరియట్ ,

తిరువనంతపురం – 695001

 

ఆన్లైన్ లో డొనేట్ చేయడం కోసం :

అకౌంట్ నెంబర్    :67319948232

బ్యాంకు                 : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

బ్రాంచి                  : సిటీ బ్రాంచ్ ,తిరువనంతపురం

ఐఎఫ్ఎస్ కోడ్       :SBIN0070028

డోనీ యొక్క పేరు : CMDRF 

మీరు దక్షిణ భారత బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మరియు ఎస్బిఐలో UPI లేదా QR కోడ్ల ద్వారా కూడా డొనేట్  చేయవచ్చు.

ఈ శతాబ్ద కాలంలో వచ్చిన భయానక వరద అని చెబుతున్నదీనికరణంగా 168 మందికి  పైగా ప్రణాలను ఇప్పటికే కోల్పోయింది కేరళ. ఇంకా అనేక మంది ఒంటరిగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికీ తక్షణ సహాయం అవసరం. కాబట్టి, రండి కలిసి వచ్చి మన తోటి ప్రజలకు సహాయం చేద్దాము. వారికి తోడుగా మానమున్నామనే భరోసా ఇద్దాం. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo