Orkut సోషల్ నెట్ వర్కింగ్ గుర్తుంది కదా మీకు 🙂 ఇప్పుడు 27, 32 వయసులో ఉన్న వారికీ బాగా పరిచయం. అప్పట్లో ఫేస్ బుక్ ఇంకా వెలుగులోకి రాకు ముందు యూత్ అందరి కేరాఫ్ అడ్రెస్ ఇది.
Orkut ను కనిపెట్టిన ఫౌండర్ ( Orkut Buyukkokten ) ఇప్పుడు మరలా కొత్త సోషల్ నెట్ వర్కింగ్ తో అందరి ముందు వస్తున్నారు. దీని పేరు Hello.( లింక్ ) ఆల్రెడీ Android and iOS కు లింక్స్ కూడా ఉన్నాయి.
అయితే కొన్ని దేశాలలోనే( US, Canada, Australia, New Zealand, UK, Ireland, France and Brazil) ఇది అందుబాటులో ఉంది ప్రసుత్తం. ఇండియాలో ఇంకా available లేదు. కొద్ది రోజుల్లోనే వస్తున్నట్లు చెబుతుంది వెబ్ సైట్.
Orkut.com సైట్ 10 ఇయర్స్ క్రితం కనిపెట్టడం జరిగింది. రెండు సంవత్సరాల పాటు దీనిని ఎవరూ సందర్శించక పోవటంతో, సెప్టెంబర్ 30 న 2014 లో ఇది మూసి వేయబడింది.
అయితే ఫేస్ బుక్, ట్విటర్, instagram అండ్ స్నాప్ చాట్ వంటి పాపులర్ సైట్స్ లో Hello ఎలా నిలుస్తుంది అని వేచి చూడాలి.