Happy Republic Day 2025: బెస్ట్ విషెస్ మరియు వీడియో స్టేటస్ ఐడియాలు ఇవిగో.!

Happy Republic Day 2025: బెస్ట్ విషెస్ మరియు వీడియో స్టేటస్ ఐడియాలు ఇవిగో.!
HIGHLIGHTS

దేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది

జనవరి 26, 1950 సంవత్సరంలో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక జరిగింది

మీకు ప్రియమైన వారికి 2025 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలియ చేయండి

Happy Republic Day 2025: దేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ఈ రోజే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుతో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొంది, ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది. జనవరి 26, 1950 సంవత్సరంలో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక జరిగింది. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో జరుగుతుంది. ఈరోజు మీకు ప్రియమైన వారికి 2025 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి మరియు వీడియో స్టేటస్ కోసం మంచి ఐడియాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాము.

Happy Republic Day 2025: బెస్ట్ విషెస్

వందేమాతరం! జైహింద్! 2025 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నివాళి అర్పిస్తూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారతదేశం మహోన్నత శక్తిగా ఎదగాలని ఆశిస్తూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

అమర వీరుల త్యాగాల త్యాగఫలమే నేటి మన స్వచ్ఛకు కారణం, మన ఈ స్వచ కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి నా నమసుమాంజలి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

దేశభక్తి పరిమళించే ప్రతి మనసుకు నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Happy Republic Day 2025

పూర్తి స్వేచ్ఛ తో వెళ్లి విరిసిన భారతావని మొదటి రోజే ఈ గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

‘వందే భారత్’ ని స్వేచ్ఛగా పలికేలా చేసిన ప్రతి స్వాతంత్య్ర సమరయోధునికి పాదాభివందనం చేస్తూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారతదేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Also Rea: Jio vs Airtel: రెండు టెలికాం కంపెనీలు అందించిన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే.!

Video Status

వీడియో స్టేటస్ కోసం యూట్యూబ్ నుంచి చాలా రిపబ్లిక్ డే వీడియోలు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ డౌన్లోడర్ ద్వారా మీకు నచ్చిన వీడియోలను డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ గా సెట్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo