Happy New Year 2025 Wishes: AI తో వాట్సాప్ లో ఇమేజెస్ మరియు గ్రీటింగ్స్ ఇలా పంపండి.!
సంవత్సరం ముగిసింది మరియు ఈరోజు నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు
మీకు నచ్చిన వారికి విషెస్ మరియు గ్రీటింగ్స్ చాలా ఈజీగా పంపండి
AI సహాయంతో చాలా సులభంగా క్రియేటివ్ గా విషెష్ చెప్పండి
Happy New Year 2025 Wishes: 2024 సంవత్సరం ముగిసింది మరియు ఈరోజు నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2025 సంవత్సరం మొదటి రోజు నచ్చిన వారికి విషెస్ మరియు గ్రీటింగ్స్ ను పంపడం ద్వారా ఈ కొత్త సంవత్సరాన్ని సంతోషాన్ని పంచుకోవచ్చు. అందుకే, ఈము వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా మీకు నచ్చిన వారికి విషెస్ మరియు గ్రీటింగ్స్ ను పంపడం కోసం AI ని ఉపయోగించి సరికొత్తగా మరియు క్రియేటివ్ ఇమేజ్ ల నుంచి విషెస్ వరకు ఎలా పంపించాలో తెలుసుకుందాం.
Happy New Year 2025 Wishes:
ముందుగా ఉన్న విధంగా కాకుండా వాట్సాప్ ఇప్పుడు AI సపోర్ట్ ను కలిగి వుంది. వాట్సాప్ లో ఉన్న Meta AI వాట్సాప్ లోనే మీరు మీకు నచ్చిన క్రియేటివ్ ఇమేజ్ లను క్రియేట్ చేసి అందిస్తుంది, దీనికోసం పెద్ద పెద్ద లైన్స్ తో కూడిన ప్రాంప్ట్ లను అందించవలసిన అవసరం కూడా లేదు. జెస్ట్ Happy New Year 2025 Wishes అని మెటా ఎఐ లో రాస్తే సరిపోతుంది. వెంటనే మీకు కొత్త క్రియేటివ్ ఇమేజ్లు అందుతాయి.
ఒక వేల మరింత క్రియేటివ్ గా ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే మీ క్రియేటివ్ ఆలోచనలకు తగిన ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే, Happy New Year 2025 image with kids smile లేదా font style లేదా kids smile ని టైప్ టైప్ చేసి అందిస్తే కొత్త కొత్త క్రియేటివ్ ఇమేజ్ లు అందిస్తుంది. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లేదా మీకు నచ్చిన వారి ఇష్టాలను బట్టి ప్రాంప్ట్ అందించడం ద్వారా వారి అభిరుచికి తగిన ఇమేజ్ ను క్రియేట్ వారికి శుభాకాంక్షలు పంపించవచ్చు.
Also Read: Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
విషెస్ కోసం AI ఉపయోగించండి
విషెష్ టైప్ చేయకుండా AI ని ఉపయోగించి ఇప్పుడు చాలా ఈజీగా విషెస్ పంపించవచ్చు. దీనికోసం Chat GPT మరియు Gemini వంటి AI చాట్ బోట్ లను ఉపయోగించి కొత్త కొత్త విషెస్ లను పొందవచ్చు. అంతేకాదు, మీకు కావాల్సిన భాషల్లో టైప్ విషెష్ ను అందిస్తుంది. మచ్చుకు కొన్ని విషెస్ ను ఇక్కడ అందిస్తున్నాను.
కాలం అనే నదిలో మరో మలుపు ఈ రోజు, కొత్త ఆరంభానికి స్వాగతం చెబుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఫ్రెండ్స్ కోసం : నా ప్రియమైన స్నేహితులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు! మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
ఇలా కొత్త మరియు మనసుకు హత్తుకునే విషెస్ ను పొందవచ్చు.
Image Source: Meta AI