Flipkart సీఈఓ Binny Bansal ఈమెయిలు ఎకౌంట్ హ్యాక్ అవటం తో కంపెని పోలిస్ కంప్లెయింట్ lodge చేసింది. బన్సాల్ మెయిల్ అకౌంట్ నుండి రెండు మెయిల్స్ వెళ్ళాయి తనకు తెలియకుండానే.
CFO – చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ – సంజయ్ baweja కు బన్సాల్ అఫీషియల్ మెయిల్ ఐడి నుండి సుమారు 5 కోట్ల 30 లక్షల రూ పంపమని మెయిల్ సారంశం.
మెయిల్ మార్చ్ 1 న ఉదయం 11.33 గం. లకు వచ్చింది. ఈ సమయంలో అడగటం CFO కు అనుమానం వచ్చి బన్సాల్ తో పర్సనల్ గా చెక్ చేస్తే అది fraud మెయిల్ అని తేలింది.
సైబర్ క్రైం పోలీసులు ఇది వేరే ఐడి లతో చేసిన ఈమెయిలు స్పూఫింగ్ అని చెబుతున్నారు. దీనిపై స్పెషల్ టీం ను నియమిస్తున్నట్లు సైబర్ సెల్ CID తెలిపారు.