Digital Arrest సైబర్ క్రైమ్ పేరుతో ప్రజలు అందుకుంటున్న ఫేక్ స్కామ్ లెటర్ తో తస్మాత్ జాగ్రత్త అని చెబుతోంది గవర్నమెంట్. ఇప్పటికే ఈ ఫేక్ డిజిటల్ అరెస్టు సైబర్ క్రైమ్ లెటర్స్ తో చాలామంది వాళ్ళ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. అందుకే స్కామర్లు ఈ కొత్త స్కామ్ ను మరింత విస్తృతంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి, ప్రజలు ఈ కొత్త స్కామ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచన ఇచ్చింది.
ఇటీవల కాలంలో ఫేక్ డిజిటల్ అరెస్టు స్కామ్ లు చాలా అధికమయ్యాయి. స్కామర్లు మీరు తప్పు చేశారు అంటూ మీ పై అభియోగం వచ్చింది అంటూ సైబర్ క్రైమ్ లెటర్స్ పంపిస్తారు. వాటిని రిప్లై ఇచ్చిన వెంటనే స్కామర్లు అసలు కథ మొదలు పెడతారు. ఈ లెటర్ ను మెయిల్ మెసేజ్ మరియు కాల్స్ ద్వారా కూడా అందిస్తున్నారు.
మరింత ఆశ్చర్య కలిగే విషయం ఏమిటంటే ఈ లెటర్ లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (I4C) వంటి ప్రధాన ఇన్వెస్టిగేషన్ సెంటర్ నుంచి వచ్చినట్లు పంపుతున్నారు. ఇది నిజమని నమ్మించడానికి తగిన అంగుళం మరియు సెటప్ ముందే చేసి ఉంచుతున్నారు. అందుకే, కొంతమంది ప్రజలు దీన్ని నమ్మి మోసపోతున్నారు.
అయితే, ప్రభుత్వం మాత్రం ఇవన్నీ బూటకం అని కొట్టిపారేయడమే కాకుండా ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కూడా హితవు పలికింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సహాయంతో ప్రభుత్వం ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇటువంటి లెటర్స్ ఇష్యూ చేయడం లేదని క్లియర్ గా ప్రకటన చేసింది.
ఇది మాత్రమే కాదు ఇటువంటి మెయిల్స్ లేదా కాల్స్ అందుకున్న వెంటనే వీటి గురించి కంప్లైంట్ చేయాలని కూడా పిలుపునిచ్చింది.
Also Read: Big Deal: 14 వేలకే బ్రాండ్ న్యూ 4K Smart Tv అందుకోండి.!
ఒకవేళ అటువంటి మోసపూరితమైన మెయిల్ లేదా కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడటానికి కూడా ప్రజలకు కొన్ని సూచనలు అందించింది.
రెస్పాండ్ అవ్వకండి: ఇటువంటి మెయిల్స్ లేదా కాల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రెస్పాండ్ అవ్వకండి.
వెరిఫై చేసుకోండి: ఒకవేళ మీకు ఇటువంటి మెయిల్స్ గాని కాల్స్ వచ్చినట్లయితే, ప్రభుత్వ ఆఫీసులో సంప్రదించి అది నిజమా కాదా అని వెరిఫై చేసుకోండి.