OTP మోసాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి New Tech తెస్తున్న ప్రభుత్వం.!
OTP మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి New Tec తీసుకు వస్తోంది
ఈ కొత్త టెక్ తో ఓటీపీ మోసాలు పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది
ఆచరణలోకి తీసుకురావడానికి సన్నాహాలు కూడా మొదలైనట్లు కూడా తెలుస్తోంది
దేశంలో నానాటికి పెరుగుతున్న OTP మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి New Tec తీసుకు వస్తోంది. ఈ కొత్త టెక్ తో ఓటీపీ మోసాలు పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం టెలికాం కంపెనీలు మరియు బ్యాంకులను ఒక్క తాటి మీదకు తీసుకు వస్తోంది. ఈ కొత్త టెక్ ను ఆచరణలోకి తీసుకురావడానికి సన్నాహాలు కూడా మొదలైనట్లు కూడా తెలుస్తోంది. మరి ప్రభుత్వం తీసుకు రాబోతున్న ఆ కొత్త టెక్ మరియు దాని సంగతులు ఏమిటో తెలుసుకుందామా.
OTP మోసాలకు చెక్ పెట్టె ఆ New Tech ఏమిటి?
బ్యాంకింగ్ సిస్టం పై నానాటికి పెరుగుతున్న వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) సైబర్ ఫ్రాడ్ మరియు ఫిషింగ్ అటాక్ ను తగ్గించడానికి ఈ కొత్త సిస్టం ను తీసుకు రాబోతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి, ప్రభుత్వం ముందుగా SBI Cards మరియు టెలికాం కంపెనీ లతో కలసికట్టుగా కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ ని తీసుకు వస్తోంది.
ఈ కొత్త టెక్ తో బ్యాంక్స్ మరియు టెలికాం కలిసి ఓటీపీ రిక్వెస్ట్ చేస్తున్న కస్టమర్ యొక్క రిజిస్టర్ అడ్రస్ మరియు కస్టమర్ జియో లొకేషన్ ను మరియు ఓటీపీ ఎక్కడ డెలివరీ చేయబడుతుందని ట్రాక్ చేస్తుంది. ఈ రెండు లొకేషన్ లలో ఏదైనా పెద్ద మార్పులు ఉన్నట్లయితే వెంటనే ఫిషింగ్ అటాక్ జరిగినట్లు గుర్తించి కస్టమర్ ను హెచ్చరిస్తుంది.
Also Read: Xiaomi Smart Tv ల పైన భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon
అంటే, కస్టమర్ ఓటీపీ మోసానికి గురి కాకుండా తగిన హెచ్చరికలు మరియు అడ్డుకోవడానికి వీలైన విధంగా ఈ టెక్ ను మలిచే ప్రయత్నం చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఈ కొత్త ఐడియా ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, దేశంలో నానాటికి పెరుగుతున్న ఓటీపీ మోసాలతో నష్టపోతున్న ప్రజలకు ఇది గొప్ప శుభవార్త అవుతుంది. ఎందుకంటే, ఓటీపీ ఫ్రాడ్స్ అనేది ప్రస్తుతం ప్రజలను ఎక్కువగా పట్టి పీడిస్తున్న సమస్య.
కానీ ఇక్కడ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. కస్టమర్ రియల్ టైం జియో లొకేషన్ ను ఖచ్చితంగా గుర్తించడం ఇక్కడ ప్రధాన సమస్య అవుతుంది. అయితే, ఈ కొత్త సిస్టం సరైన ఫలితాలను అందిస్తే మాత్రం ఓటీపీ మోసాలకు చెక్ పెడుతుంది.