Cyber Frauds పై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం: 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్.!
Cyber Frauds నేటి నవీన యుగంలో అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారింది
అందుకే ప్రభుత్వం సైబర్ నేరాల పై ఉక్కు పాదం మోపింది
ప్రభుత్వం 6 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లను డీ యాక్టివేట్ చేయడమే కాకుండా 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్ కూడా చేసింది
Cyber Frauds నేటి నవీన యుగంలో అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. అందుకే, ప్రభుత్వం సైబర్ నేరాల పై ఉక్కు పాదం మోపింది. ఇప్పటికే, వచ్చిన కంప్లైంట్ మరియు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని 6 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లను డీ యాక్టివేట్ చేయడమే కాకుండా 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్ కూడా చేసింది.
Cyber Frauds
దేశంలో ప్రధాన సమస్యగా మారిన సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు చేపట్టిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైబర్ నేరాల కోసం తీసుకు వచ్చిన ది ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (I4C) ను రంగంలోకి దించింది. యాక్షన్ లోకి దిగిన I4C వింగ్ 6,00,000 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లు మరియు సైబర్ స్కామ్ లకు సహకరిస్తున్నట్లు కనుగొన్న 65,000 లకు పైగా URLs ను కూడా బ్లాక్ చేసింది. ఇది కాకుండా సైబర్ నేరాలకు ఆయువు పట్టుగా ఉన్న 800 పైగా Apps ను కూడా బ్లాక్ చేసినట్లు, The Focal News రిపోర్ట్ చేసింది.
I4C వింగ్ ప్రయత్నంతో దేశంలో విచ్చలవిడిగా పెట్రేగి పోతున్న సైబర్ నేరగాళ్ల రెక్కలు విరిచేలా ప్రభుత్వం చేయగలిగింది. సైబర్ నేరగాళ్ల పై చేసిన పోరాటంలో ది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) కూడా ప్రధాన పాత్ర పోషించింది. 2023 నుంచి ఈ పోర్టల్ పై 1,00,00 కు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కంప్లైంట్ లను అందుకుంది. వీటిలో 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్, 62 వేలకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులు నమోదు అయ్యాయి.
Also Read: OPPO K12x 5G కొత్త కలర్ వేరియంట్ భారీ ఆఫర్ తో రేపు మొదటిసారిగా సేల్ అవుతుంది.!
అసలు ఏమిటీ ఈ I4C వింగ్?
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధీనంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (CIS) తో ఈ I4C వింగ్ పని చేస్తుంది. ఈ I4C వింగ్ 5 అక్టోబర్ 2024 తేదీన స్థాపించ బడింది. ఈ వింగ్ ఇప్పుడు దేశంలోని సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తోంది. ఇది అధిక ప్రాధాన్యత కలిగిన కేసులు ఛేదించడానికి స్టేట్ కంట్రోల్ రూమ్స్ తో కలిసి పని చేస్తుంది.