ఇక దేశంలో Cyber Fraud అనేదే ఉండదు.. ప్రభుత్వం కొత్త స్టెప్ అదిరిందిగా.!

Updated on 06-Mar-2024
HIGHLIGHTS

దేశంలో Cyber Fraud అనేదే లేకుండా ఏరిపారేయడానికి ప్రభుత్వం కొత్త స్టెప్ తీసుకుంది

సైబర్ నేరాల పైన నిఘా ఉంచిన ప్రభుత్వం వాటిని అరికట్టడానికి కొత్త ఈ కొత్త చర్య తీసుకుంది

కాల్స్, మేసేజ్ మరియు మరిన్ని మార్గాల ద్వారా జరుగుతున్న మోసాలకు చెక్ పెడుతుంది

దేశంలో Cyber Fraud అనేదే లేకుండా ఏరిపారేయడానికి ప్రభుత్వం కొత్త స్టెప్ తీసుకుంది. గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పైన నిఘా ఉంచిన ప్రభుత్వం వాటిని అరికట్టడానికి కొత్త ఈ కొత్త చర్య తీసుకుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఈ చర్య ద్వారా కాల్స్, మేసేజ్ మరియు మరిన్ని మార్గాల ద్వారా జరుగుతున్న మోసాలకు చెక్ పెడుతుంది. సైబర్ నేరాల దెబ్బకి వణికి పోతున్న ప్రజలకు ఇది నిజంగా అమృతం లాంటి వార్తే అవుతుంది.

Cyber Fraud అరికట్టడానికి ప్రభుత్వం ఏమి చేసింది?

Cyber Fraud అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా Chakshu ను తీసుకు వచ్చింది. sancharsaathi.gov.inపోర్టల్ నుండి తీసుకు వచ్చిన ఈ కొత్త పోర్టల్ నుండి కాల్స్, SMS మరియు వాట్సాప్ ద్వారా ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నించే వారి పైన రిపోర్ట్ చెయవచ్చు. ఇందులో రిపోర్ట్ చేయడం చాలా సులభం మరియు అందుకున్న రిపోర్ట్స్ పైన చాలా వేగంగా చర్యలు తీసుకోబడతాయని కూడా ప్రభత్వం తెలిపింది. మంచి విషయం ఏమిటంటే ఈ పోర్టల్ దేశంలోని ప్రధానమైన 19 భాషల్లో అందుబాటులో వుంది.

Also Read: Lava Blaze Curve: అతి చవక ధరలో వచ్చిన కర్వ్డ్ 5జి మొబైల్ గా నిలిచింది.!

Chakshu లో రిపోర్ట్ ఎలా చెయ్యాలి?

Chakshu లో రిపోర్ట్ చెయ్యడానికి ముందుగా sancharsaathi.gov.in పోర్టల్ ను ఓపెన్ చెయ్యాలి. ఇక్కడ మీకు మెయిన్ పేజ్ కనిపిస్తుంది మరియు ఇందులో ‘అనుమానిత ఫ్రాడ్ కమ్యూనికేషన్ నివేదించండి’ అని కనిపిస్తున్న బాక్స్ పైన నొక్కండి. బాక్స్ పైన నొక్కగానే కొత్త పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ చక్షు – అనుమానిత ఫ్రాడ్ కమ్యూనికేషన్ ని నివేదించండి అని కనిపిస్తుంది.

సంచార్ సాథీ

ఇక్కడ మీరు అనుమానిత మోసం కమ్యూనికేషన్ యొక్క మాధ్యమం అని అడిగిన వద్ద క్రింద బాక్సులో మీడియం ఎంచుకోండి. బాక్స్ పైన నొక్కగానే ఇక్కడ (కాల్ చేయండి, SMS మరియు WhatsApp) అని మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి. ఇక్కడ మీరు కావాల్సిన మాధ్యమాన్ని ఎంచుకోవాలి.

సంచార్ సాథీ చక్షు

అనుమానిత మోసం కమ్యూనికేషన్ వివరాలు అని మరొక బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు వర్గం (Category) లో కనిపించే వాటిలో మీరు రిపోర్ట్ చేయ్యడానికి తగిన కారణాన్ని ఎంచుకోండి. ఇందులో, ఫేక్ కాల్, ఆన్లైన్ జాబ్, KYC మరియు మరిన్ని రీజన్స్ డీఫాల్ట్ గా అందించబడ్డాయి. ఇక్కడ మీరు అందించిన కారణానికి తగిన ఫైల్ (స్క్రీన్ షార్ట్) వంటివి కూడా జత చెయ్యాలి.

ఈ వివరాల అందించిన తరువాత క్రింద అడిగిన వద్ద తేదీ మరియు సమయం లను కూడా సెలక్ట్ చెయ్యాలి. ఇక అడుగున పిర్యాదు వివరాలను నమోదు చెయ్యండి అని సూచించిన బాక్స్ లో మీరు చేయాల్సిన కంప్లైంట్ గురించి వివరంగా రాయండి. ఇంతటితో మీ కంప్లైంట్ గురించి మీరు అందించాల్సిన వివరాలు పూర్తవుతాయి.

సంచార్ సాథీ చక్షు

ఇక పీజే చివరిలో మీ పర్సనల్ వివరాలను అందించమని కోరుతుంది. ఇక్కడ సూచించిన వద్ద మీ పూర్తి పేరును రాయాలి. అలాగే, క్రింద ‘అనుమానిత మోసం కమ్యూనికేషన్ అందిన ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి’ అని అడిగిన వద్ద కాల్స్ లేదా SMS అందుకున్న మొబైల్ నెంబర్ ను నమోదు చెయ్యండి. దీని తరువాత OTP కోసం పైన కనిపించే టెక్స్ట్ ను నమోదు చేసి OTP కోసం మొబైల్ నెంబర్ ను ద్రువీకరించండి అని కనిపించే బాక్స్ పైన నొక్కండి.

తరువాత మీరు మీ మొబైల్ నెంబర్ పైన OTP ని అందుకుంటారు. ఈ OTP ఎంటర్ చేసిన తరువాత మీ సమస్య రిపోర్ట్ నమోదు అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :