దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన స్కామ్ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్నేషనల్ Scam Calls ను బ్లాక్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం కొత్త సిస్టం ను పరిచయం చేసింది. ఈ కొత్త సిస్టం స్పూఫ్ కాల్స్ ను గుర్తించి వాటిని నిలువరిస్తుంది. ఈ కొత్త సిస్టం పనితీరు తో ప్రజలు ఇంటర్నేషనల్ కాల్ స్కామ్స్ భారిన పడకుండా స్కామర్ల నుంచి కాపాడబడతారు అని ప్రభుత్వం చెబుతోంది.
గత కొంత కాలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కాల్ స్కామ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. అందులోను, మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా ఎక్కువగా స్కామ్ లు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చాయి. అందుకే, ఇటువంటి మోసాలు జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త సిస్టం ను తీసుకు వచ్చింది.
సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి పని చేసిన DoT యొక్క శ్రమ ఫలితమే ఈ కొత్త సిస్టం అని \ప్రభుత్వం డాట్ ను కొనియాడింది. ప్రజలను మోసం చేయడానికి భారతీయ మొబైల్ నెంబర్ లా కనిపించేలా స్పూఫ్డ్ కాల్స్ ను ఈ కొత్త సిస్టం అడ్డుకుంటుంది. స్కామర్లు, ఇతర దేశాల నుంచి చేసే కాల్స్ ను భారత్ దేశ యూజర్ మాదిరిగా కనిపించేలా +91 XXXXX12345 ఫార్మాట్ లో నెంబర్ ను సెట్ చేసి కాల్ చేస్తున్నారు. ఇది స్పూఫ్డ్ కాల్ మరియు డిస్ప్లే నెంబర్ గా కనిపించే కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI) గా చెబుతారు.
ఇలా చేయడం ద్వారా ఈ నెమరు ఇంటర్నేషనల్ నుంచి వచ్చే కాల్ మాదిరిగా కాకుండా మన దేశం నుంచి వచ్చే లోకల్ కాల్ మాదిరిగా మానిప్యులేట్ చేయగలుగుతారు. అందుకే, ఇటువంటి క్లాస్ ద్వారా స్కామ్ చేయడం చాలా సులభం అయ్యింది.
Also Read: Flipkart Sale జబర్దస్త్ ఆఫర్: 16 వేలకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!
అయితే, ఇప్పుడు ప్రభుత్వం అందించిన కొత్త సిస్టం ద్వారా ఇలా చేయడానికి అడ్డుకట్ట పడుతుంది. ఎందుకంటే, బయట దేశం నుంచి వచ్చే స్పూఫ్డ్ కాల్స్ ను కొత్త సిస్టం ఫిల్టర్ చేసి బ్లాక్ చేస్తుంది. అంటే, కాల్ చేసే నెంబర్ ఒకటి దాని CLI నెంబర్ మరొకటిగా ఉండే నెంబర్లు బ్లాక్ చేస్తుంది. అంతేకాదు, ఈ కొత్త సిస్టం ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలోనే 1.35 కోట్ల స్పూఫ్డ్ కాల్స్ ను బల్క్ చేసినట్లు కూడా ప్రభుత్వం తెలిపింది.