దేశం మొత్తం స్కామ్ కాల్స్ తో అట్టుడికిపోతోంది. ఇప్పటికే Scam Calls తో స్కామర్ల వలలో చిక్కుకొని చాలా మంది తమ డబ్బును పోగొట్టుకున్నారు. అయితే, చాలా మంది ప్రతి రోజు స్కామ్ కాల్స్ ని ఎదుర్కొంటున్నారు. కొందరు ఈ కాల్స్ ని spam Calls గా రిపోర్ట్ చేస్తున్న ఈ కాల్స్ గొడవ తప్పడం లేదని చెబుతున్నారు. అందుకే, ఇటువంటి కాల్స్ పై ఎలా రిపోర్ట్ చేయాలి మరియు ఎక్కడ చేయాలి అనే విషయాలు ప్రభుత్వం తెలియ చేసింది.
డిపార్ట్మెంట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) ఇప్పటికే స్కామర్స్ ను గుర్తించడానికి వీలుగా కొత్త ఫిల్టర్ లను ఉపయోగిస్తుంది. అయితే, దీనికి తోడుగా గవర్నమెంట్ బాడీ కూడా ప్రజలు అవలంభించాల్సిన విధానాలు షేర్ చేసింది.
ముందుగా మరియు వేగంగా కంప్లైంట్ లను ఆన్లైన్ లో రిపోర్ట్ చేయడానికి వీలుగా సంచార్ సాథీ పోర్టల్ ను అందించింది. దీనికోసం sancharsaathi.gov.in పోర్టల్ లోకి వెళ్ళి ఫేక్ కాల్స్ మరియు ఇతర స్కామ్ యాక్టివిటీ లను రిపోర్ట్ చేయవచ్చు. మరింత సింపుల్ గా రిపోర్ట్ చేయాలనుకుంటే, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి జరిగిన విషయం క్లియర్ గా తెలియపరచవచ్చు.
ఇక అన్నింటి కన్నా సులువైన మరియు శీఘ్రమైన పని మీ దగ్గరలోని లోకల్ పోలీస్టేషన్ లో కేస్ ఫైల్ చేయడం. దీనికోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా సైబర్ క్రైం వింగ్ ను కూడా నిర్వహిస్తోంది.
Also Read: అమెజాన్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్న Boat Dolby Atmos సౌండ్ బార్.!
DoT అనుసారం కొన్ని చిన్న చిన్న టిప్స్ అనుసరించడం ద్వారా స్కామ్ మరియు ఫ్రాడ్ స్టర్స్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను ఎప్పుడూ ఫోన్ కాల్ లో షేర్ చేయకండి. అనుమానిత కాల్ మీరు అందుకున్నట్లయితే వెంటనే కట్ చేయండి. ఒకవేళ SMS అయితే వెంటనే డిలీట్ చేయండి. మీకు వచ్చింది స్కామ్ కాల్ అని తెలిసిన వెంటనే నెంబర్ ను డిలీట్ చేసి రిపోర్ట్ చేయండి. మీరు తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలు మీరు స్కామర్ల బారిన పడకుండా కాపాడుతాయి.