2019 లోక్ సభ ఎన్నికల కోసం అడ్వర్టైజింగ్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ని పరిచయం చేయనున్నగూగుల్
ఇది ఓటర్లకు వారికీ కావలసిన ఎలక్షన్ సంబంధిత సమాచారం అందిస్తుంది.
ముఖ్యాంశాలు
1. ఇప్పుడు Google భారతదేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది
2. రాజకీయ ప్రకటన పైన పారదర్శక నివేదిక మరియు రాజకీయ ప్రకటనల యొక్క లైబ్రరీ ప్రారంభించబడతాయి
3. ప్రకటనదారుల గుర్తింపు
రాబోయే 2019 లోక్ సభ ఎన్నికలలో పారదర్శకత తీసుకురావడానికి, సెర్చ్ఇంజిన్ అయినటువంటి గూగుల్ లో కూడా ముందుకు రాబోతుందని ప్రకటించారు. Google ప్లాట్ఫారమ్లలో ప్రకటనలను రూపొందించే బాధ్యతని, ఇప్పుడు Google మరింత బాధ్యతవహితంగా చేస్తుంది. దీనితో, ఓటర్లు కూడా ఎన్నికలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందగలుగుతారు. ఈ కంపెనీ ప్రకారం, ఆన్లైన్ ఎన్నికల ప్రకటనలో పారదర్శకత తీసుకురావడానికి Google India -Specific Political Advertising Transparency Report ను సమర్పించనుంది. దీనితో పాటుగా, రాజకీయ ప్రకటనలు యొక్క ఒక లైబ్రరీని కూడా తీసుకొస్తుంది.
ఇప్పుడు మీరు కూడా, Google ద్వారా భారత రాజకీయ ప్రకటనలకు సంబంధించిన అన్ని వార్తలను మరియు సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రక్రియ మార్చి 2019 నుండి లైవ్ చేయబడుతుంది. మీరు Google ప్లాట్ఫారం నుండి ఎన్నికల కోసం యాడ్స్ ఎవరు కొనుగోలు చేస్తున్నారో మరియు దాని కోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందనే దాని గురించి కూడా మీకు తెలుస్తుంది. ఈ Google ఫీచర్ US లో ప్రారంభించింది మరియు మీరు ఈ లింక్ ద్వారా దాన్ని చూడవచ్చు, ప్రకటనదారులు Google Ads Services నుండి యాడ్స్ ఇవ్వడానికి ఎంత ఖర్చచేస్తున్నారని తెలుసుకోవడానికి ఈ Link ద్వారా తెలుసుకోవచ్చు.
లొకేషన్ కు వెళ్లి, మీరు మెను నుండి రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చు మరియు వారు పెట్టిన ఖర్చు గురించి తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు "టాప్ అడ్వర్టైజర్" పేరుతో ప్రకటనకర్తలు లేదా గ్రూపు కోసం సెర్చ్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఎన్నికలకు అందుబాటులో ఉంటుంది. ఎన్నికల కోసం గూగుల్ Election Commission Of India మరియు ఇతర ధృవీకృత వనరులు కూడా అందుబాటులో ఉంటాయి.
గూగుల్ ఇండియా పబ్లిక్ పాలసీ యొక్క డైరెక్టర్ అయినటువంటి, చేతన్ కృష్ణస్వామి " రానున్న 2019 ఎన్నిలకల్లో 850 మిలియన్ భారతీయులు రానున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఓటు వేస్తారని ఆశిస్తున్నామని, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధంగా, ఈ ఆన్లైన్ దశ ఎన్నికలలో పారదర్శకతను తెచ్చుటకు ఈ చర్య తీసుకోబడింది.